నంద్యాల ఉప ఎన్నికలకు అధికార పార్టీకి ఈసి షాక్



నంద్యాల ఉప ఎన్నిక టీడీపీ, వైసీపీలకు రెఫ‌రెండ‌మ్‌లాంటివే . 2019 ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీపై తీవ్ర స్థాయిలో రాజకీయంగా ప్రభావం ఉంటుంది. అధికార పార్టీ ఏకంగా వందల కోట్లు కుమ్మరిస్తుండ‌టంతోపాటు కేబినెట్‌ మొత్తం నంద్యాలలోనే తిష్ట వేసింది. వేల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్పించేందుకు ప్రయత్నించార‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

అధికార పార్టీ భారీగా అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని ఈసీకి ఫిర్యాదు చేసింది. పైగా ముందుజాగ్రత్తగా తమ పార్టీ గెలుపు కోసం పనిచేసే ఉద్యోగులను నంద్యాలలో టీడీపీ నియమించుకుందని అనుమానం వ్యక్తం చేస్తోంది. దీనిలో బాగంగానె రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పోలీసు బలగాలపై కూడా నమ్మకం లేదంటూ వైసీపీ చేసిన ఫిర్యాదు మేరకు ఇసి సానుకూలంగా స్పందించింది.

దీంతొ కేంద్ర బలగాలను రంగంలోకి దింపుతోంది. నంద్యాల ఉప ఎన్నిక మొత్తం కేంద్ర బలగాల కనుసన్నల్లోనే జరపాలని నిర్ణయం తీసుకుంది. నిజంగా ఇ సి నిర్ణయం ప్రభుత్వానికి చెంపపెట్టే. స్ధానిక పోలీసులను సాధారణ విధులకు మాత్రమే ఉపయోగించుకోవాలని ఇసి తీసుకున్న నిర్ణయంతో టిడిపికి ఇబ్బందే. అంటే ప్రతీ పోలింగ్ బూత్ పరిధిలోనూ కేంద్ర బలగాలు మాత్రమే ఉంటాయి.

నిబంధనల ప్రకారం పోలింగ్ బూత్ లోకి ఓటర్లను, అభ్యర్ధిని, అభ్యర్ధి తరపు ప్రధాన ఏజెంటును మాత్రమే అనుమతిస్తారు. ఎక్కడైనా అధికారపార్టీ నేతలకే పోలీసుల వత్తాసుంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ముందుజాగ్రత్తగా వైసీపీ ఇదే విషయాన్ని ఇ సి వద్ద ఫిర్యాదు చేసింది. అసలే, నంద్యాల ఉపఎన్నిక ఇరుపార్టీలకూ ప్రతిష్టగా మారింది. దానికితోడు ఇప్పటి వరకూ స్ధానిక అధికారులు టిడిపి చెప్పినట్లు ఆటాడుతున్నారు.

మరో మూడు రోజుల్లో 7 కంపెనీల పారా మిలటరీ బలగాలు నంద్యాలకు రానున్నాయి. ప్రతీ పోలింగ్ బూత్ కు పారా మిలటరీ కాపలా వల్ల అధికార పార్టీ ఆటలు సాగవన్నది బహిరంగ వాస్తవం. తమ ఫిర్యాదుకు సానుకూలంగా స్పందించటం పట్ల వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటె టీడిపీకి పెద్ద దెబ్బే.


ThanQ Visit Again.

Related Posts