ఆంధ్రలో 10 వేల ఉద్యోగాలు




ఆంధ్ర రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు చల్లని కబురు అందింది.ఆ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 10000 పోస్టుల భర్తీకి అర్ధిక శాఖ ఆమోదం తెలిపినట్టు సమాచారం. గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఏపిపిఎస్సి ద్వారా 4009 పోలీసు నియామక సంస్థ ద్వారా 5991 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది.
దీనిపై ఆర్ధిక శాఖ ప్రత్యెక కార్యదర్శి అజయ్ కల్లం ఉత్తర్వులు జారీ చేసారు. 1000 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు కూడా భర్తీ చేయనున్నట్టు సమాచారం. జలవనరులశాఖలో 350 ఏఈఈ పోస్టుల భర్తీ, రెవెన్యూశాఖలో 200 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పోస్టుల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ప్రభుత్వ ప్రకటనపై సంతోషం వ్యక్తం చేసారు.
ThanQ Visit Again.

Related Posts