మీ ఆధార్ కార్డులో ఉన్న తప్పులను ఎలా సరిచేసుకోవాలి !




ఆధార కార్డు అనేది తప్పనిసరిగా అందరి వద్ద ఉండాలని ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది. నానా తంటాలు పడి అప్లై చేస్తే చివరకు వచ్చింది కాని.. అందులో తప్పులు ఉన్నాయని చాలా మంది అంటుంటారు. ఈ తప్పులను సరిదిద్దుకోవడం అంటే అపట్లో కష్టమయ్యేది కానీ ఇప్పుడు చాల సులభం. మీ పేరు, చిరునామా లేదా ఇతర వివరాలలో ఏదైనా తప్పులు వస్తే వాటిని ఎలా సరిచేస్కోవాలో ఒక్కసారి చూద్దాం.
* ముందుగా ఆధార అప్డేట్ చేసే వెబ్ సైట్ కు వెళ్ళాలి (ఈ లింక్ పై క్లిక్ చేయండి Aadhaar Self Service Update Portal).  
* మీ ఆధర్ నెంబర్ ఎంటర్ చేసి, కింద ఉన్న వెరిఫికేషన్ కోడ్ ను ఎంటర్ చేసిన తరువాత... సెండ్ ఓటీపీ (SEND OTP) అనే బటన్ పై క్లిక్ చేయండి.
* మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వన్ టైం పాస్ వర్డ్ (OTP) వస్తుంది. ఆ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసాక తర్వాతి పేజీకి వెళ్తారు.
* ఈ పేజీలో మీ పేరులో, చిరునామాలో, ఇమెయిల్ అడ్రస్ లో ఏదైనా మార్పులు చెయ్యాలనుకుంటే చేయవచ్చు.
* కొత్తగా ఇచ్చిన వివరాలకు ఆధారంగా ఏదైనా డాక్యుమెంట్ కాపీ సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ చిరునామాలో ఏదైనా మార్పులు చేస్తే, కొత్త చిరునామా కు సంభందించిన ఏదైనా డాక్యుమెంట్ యొక్క జిరాక్స్ కాపీని సెల్ఫ్ అటెస్టేషన్ తో స్కాన్ చేసి అప్ లోడ్ చెయ్యాలి.
* ఈ మార్పులు చేసిన తరువాత యుఅర్ఎన్ (Update Request Number) నెంబర్ ను రాసి పెట్టుకుంటే తదుపరి విచారణకు ఉపయోగపడుతుంది.
* మీరు ఇచ్చిన వివరాలు ఆధార్ లో చోటు చేసుకున్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ వెబ్ సైట్ ను సందర్శించండి (ఈ లింక్ పై క్లిక్ చేయండి Aadhaar Status). ఇక్కడ మీ ఆధార్ నెంబర్ మరియు యుఅర్ఎన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డులో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయా లేక అప్రూవల్ పెండింగ్ లో ఉందా అనే విషయం తెలుస్తుంది.
* ఒకవేళ అప్రూవల్ ముగిసి ఉంటె ఆధార కార్డును ఇ-కార్డు (e-Card) రూపంలో పొందవచ్చు. ఇ-కార్డును పొందడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి e-Aadhaar Card. ఇక్కడ మీ పూర్తి పేరు, ఏరియా పిన్ కోడ్, వెరిఫికేషన్ కోడ్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వన్ టైం పాస్ వర్డ్ (OTP) వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత ఇ-కార్డు ను డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది.
* ఒకవేళ మీ దగ్గర రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ (మొదటిసారి ఆధార కార్డుకు అప్లై చేసినప్పుడు ఇచ్చిన నెంబర్) కనుక ఇప్పుడు వాడకంలో లేకుంటే దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి వెళ్లి మొబైల్ నంబర్ ను మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలి. లేదా కింద ఇచ్చిన చిరునామాలకు పోస్టు ద్వారా దరఖాస్తు పంపించవచ్చు.
చిరునామాలు:
Address 1: UIDAI, Post Box No. 10, Chhindwara, Madhya Pradesh – 480001, India.
Address 2: UIDAI, Post Box No.99, Banjara Hills, Hyderabad, Telangana – 500034, India.
కవర్ పైన స్పష్టంగా ఆధార్ అప్ డేట్/కరెక్షన్ అని రాసి మీ పేరు, చిరునామా తెలియజేసే గుర్తింపు పత్రాన్ని తప్పనిసరిగా జత చెయ్యాలి.

ThanQ Visit Again.

Related Posts