మంచి సినిమా ఏదైనా రిలీజ్ అయితే చాలు... అది చూడనిదే నిద్ర పట్టదు కొందరికి. అలాగే భోజన ప్రియులకు రకరకాల ఆహారాలను లగించాలని ఉంటుంది. ఇక ఆడవారికి మార్కెట్లోకి కొత్తగా వచ్చిన డిజైనర్ వస్త్రాలు, షూస్, హ్యాండ్ బ్యాగ్స్ లాంటివి కొనాలని ఉంటుంది. కాని ఉద్యోగం చేస్తూ, ఇటు ఇంట్లో వాళ్ళతో సమయం గడపక, అటు సినిమాలకి, షికార్లకి వెళ్ళలేక, నచ్చిన ఆహారాన్ని తినే తీరిక లేక తెగ భాదపడుతూ ఉంటారు. తీర ఏ అర్ధరాత్రో బయటకు వెళ్దాం అంటే అప్పటికే అన్ని మూసేసుకొని ఉంటారు.
ఇవన్ని చేయడానికి టైం లేదని భాదపడేవారికి కేంద్ర ప్రభుత్వం నుండి ఓ శుభవార్త వచ్చింది. ఇక నుండి 24గంటల పాటు సంవత్సరమంతటా సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, బ్యాంక్స్ లాంటివి తెరిచి ఉంచవచ్చని.. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ కు కేంద్ర కేబినేట్ మద్దతునిచ్చింది. దేనితో పాటు పది మంది కన్నా ఎక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలు కూడా ఇకనుండి 24 గంటలు తెరిచి ఉంచవచ్చునని వారు పేర్కొన్నారు. దేశమంతటా ఈ యాక్ట్ ను అమలు చేసేందుకు కేంద్రం దీనిని రూపొందించింది. ప్రస్తుతం ప్రతి ఒక్క వస్తువు ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేయచ్చు. ఆన్ లైన్ సర్వీసులు వచ్చిన తరువాత రిటైల్ రంగం మందగించిన నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చింది కేంద్రం.
మహిళలు కూడా 24 గంటలు పని చేయవచ్చని... అయితే వారికి సరైన వసతులు, రక్షణ, రవాణా సదుపాయాలు కలిపించాలి అంటూ నిభందనలు పెట్టారు. క్యాబ్ సర్వీసులు ఉన్న కంపెనీలలో మహిళలు 24 గంటలు పనిచేయవచ్చని వారు తెలిపారు.
ఈ పాలన అమలు అయిన తరువాత ఎప్పుడు పడితే అప్పుడు సినిమా చూడవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు, రెస్టారెంట్లకు వెళ్ళవచ్చు అని... బయట పనులు చేసుకోడానికి ఎక్కువ సమయం దొరుకుతుందని.. అలాగే దేశమంతటా ఉద్యోగ అవకాశాలు 10 శాతం పెరుగుతాయని అంటుంది కేంద్రం.
