ఆండ్రాయిడ్ యాప్స్ తో మీ ఫోన్ జాగ్రత్త





ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్  వాడని వారు అరుదు. కోడి కూతలా మనల్ని పొద్దున్నే నిద్ర లేపే అలారం నుండి రాత్రి పూట విదేశాల్లో ఉన్న మన బంధుమిత్రులతో వీడియో కాల్స్ మాట్లాడే వరకు.. అన్నిటికి స్మార్ట్ ఫోన్ పైనే ఆదారపడి పోయారు అందరు. స్మార్ట్ ఫోన్ లో కొన్ని వేలల్లో ఉపయోగకరమైన యాప్స్ లభిస్తాయన్న విషయం మనకు తెలిసిందే. అలానే వీటిలో కొన్ని యాప్స్ మన ఫోన్ కు చాలా హాని తలపెడతాయి. ఈ యాప్స్ వల్ల మన ఫోన్ లో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ ను మనకు తెలియకుండా స్వాధీనం చేసుకుంటారు కొందరు, వాటి ద్వారా అక్రమ కార్యకలాపాలు చేసే అవకాశం కూడా ఉంటుంది అంటే నమ్మగలరా? ఈ యాప్స్ ను వెంటనే తీసి పారేయడం చాలా మంచిది.
 
మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ తో పాటు మన ఫోన్ కు హాని తలబెట్టే యాప్స్ ను ఒక్కసారి చూదం!!
 
1. UC Browser
చైనా మరియు ఇండియాలో యుసి బ్రౌజర్ చాలా పాపులర్. ఈ బ్రౌజర్ చాలా ఫాస్ట్ గా పని చేస్తుందని... మొబైల్ డేటా తక్కువగా వాడుతుందని... ఇలాంటి తప్పుడు ప్రచారాలతో తెగ పాపులర్ అయిపోయింది. కాని వాస్తవానికి మీ ఇన్ఫర్మేషన్ అంతా సేకరిస్తుంది. మీరు ఏ ఫోన్ వాడుతున్నారు, IMEI నెంబర్, ఆండ్రాయిడ్ ID, WiFi వివరాలతో పాటు మీరు ఎక్కడ ఉన్నారు అనే వివరాలు మీ వీధి చిరునామాతో సహా ఈ యాప్ సేకరిస్తుంది.
 
2. ES File Explorer
మీ ఫోన్ లో ఉన్న సాంగ్స్, వీడియోస్, ఫొటోస్, డాక్యుమెంట్స్ లాంటివి ఈఎస్ ఫైల్ ఎక్స్ ప్లోరర్ లో బద్రపరుచుకోవచ్చు. కాని ఈ యాప్ వల్ల మీ ఫోన్ లోకి వైరస్ రావడం మాత్రం ఖాయం. దీనికి తోడు కొత్త యాప్స్ డౌన్లోడ్ చేసుకొమ్మని తరచుగా నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి. మన ఫోన్ లోని నోటిఫికేషన్ బార్ లో ఈ నోటిఫికేషన్స్ డిలీట్ చేయడం కూడా వీలు కాదు.
 
3. QuickPic
చీతా మొబైల్ వారు తయ్యారు చేసిన ఈ యాప్... ఫోన్ లోని గ్యాలెరీ కోసం పనిచేస్తుంది. కాని దానిలోని డేటా అంతా ఆ కంపెనీ వారు తమ సర్వర్ లలో నింపుకుంటున్నారు అని... ఈ వివరాలతో  ఇటీవలే అక్రమ కార్యకలాపాలకు పాలపడుతున్నారని తెలిసింది.
 
4. CLEAN it
ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే.. మీ ఫోన్ ను క్లీన్ చేస్తుందని... దీంతో మీ ఫోన్ చాల ఫాస్ట్ గా పనిచేస్తుందని అంటారు. కాని వాస్తవానికి స్మార్ట్ ఫోన్ కు ఎలాంటి క్లీనింగ్ అవసరం లేదు. ఎందుకంటే మీరు తరుచుగా వాడే యాప్స్ లో మీరు ఎక్కడివరకు వాడారో అక్కడినుండే తిరిగి ప్రారంభమవుతాయి. కాని క్లీన్ ఇట్ లాంటి యాప్స్ RAMను (ర్యాం ను) క్లియర్ చేయడంతో తిరిగి మొదటినుండి ప్రారంభించాల్సి వస్తుంది... అలా చేస్తేనే మీ ఫోన్ స్లో అవుతుంది, బ్యాటరీ పవర్ త్వరగా అయిపోతుంది.
 
5. Music Player

పేరుకు తగట్టే ఈ యాప్ మీ ఫోన్ లోని మ్యూజిక్ ను ప్లే చేస్తుంది. కానీ ఈ యాప్ లో వచ్చే యాడ్స్ మీ మొబైల్ డేటాను జీబీలలో (GB) మింగేయడంతో పాటు... బ్యాటరీని కూడా దెబ్బతీస్తుంది.
 
6. DU Battery Saver & Fast Charging
ఈ యాప్ అడ్డమైన యాడ్ లతో మీ ఫోన్ ను నింపేస్తుంది. దీన్ని చాలామందే వాడుతుంటారు. ఎందుకంటే ఫోన్ ఛార్జింగ్ కాపాడుతుందని... త్వరగా ఛార్జింగ్ ఎక్కేలా చేస్తుందని వారి నమ్మకం. కాని అదంతా ఫేక్ అని గుర్తించండి. ఇలాంటి యాప్స్ ప్లే స్టోర్ లో వేలల్లో ఉంటాయి. ఏ ఒక్క యాప్ కూడా మీ ఫోన్ ఛార్జింగ్ స్పీడ్ ను మార్చలేదు.
 
7. Dolphin Web Browser
ఈ బ్రౌజర్ కూడా యుసి బ్రౌజర్ కోవకు చెందినదే. ఈ యాప్ కూడా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా సేకరిస్తుంది. గూగుల్ క్రోమ్ లో ఇన్కోగ్నిటో (incognito) మోడ్ ఉంటుంది. సాధారణంగా ఈ మోడ్ లో మనమేదైనా బ్రౌజ్ చేసినప్పుడు అది హిస్టరీలో సేవ్ అవ్వదు. కాని డాల్ఫిన్ బ్రౌజర్ లో మాత్రం ఇంకోగ్నిటో మోడ్ లో ఉన్నా ఆ వివరాలంతా ఓ ఫైల్ రూపంలో మీ ఫోన్ లో సేవ్ అయ్యి ఉంటాయి. కావాలంటే చెక్ చేసుకోండి.

ThanQ Visit Again.

Related Posts