కబాలి ట్రైలర్ రిలీజ్ ఎందుకు లేటైంది ? Kabali Trailer





సినిమాల ప్రమోషన్ కి మేకర్స్ ఓ ఫిక్సెడ్ ఫార్మాట్ ని పాటిస్తున్నారు. ముందు ఫస్ట్ లుక్.. ఆ తర్వాత మోషన్ పోస్టర్.. నెక్ట్స్ టీజర్.. ఆ తర్వాత ఆడియో లాంఛ్.. ఆడియో రిలీజ్ సమయంలోనే థియేట్రికల్ ట్రైలర్ ఇస్తుంటారు. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ కబాలి విషయంలో మాత్రం అన్నీ ఓకే అయినా.. ఇంకా థియేట్రికల్ ట్రైలర్ ఇవ్వలేదు.

అటు తమిళ్ లోను.. ఇటు తెలుగులోను ఆడియో లాంఛ్ కార్యక్రమం పూర్తయిపోయింది. ఇప్పుడంటే కబాలి వాయిదా పడిందని అంటున్నారు కానీ.. ఆడియో రిలీజ్ టైంకి అయితే జూలై 15న విడుదల ఖాయమనే అన్నారు. అయినా సరే.. ఏ భాషలోనూ థియేట్రికల్ ట్రైలర్ మాత్రం ఇవ్వలేదు. ఇందుకు కారణం.. రజినీకాంత్ అని తెలుస్తోంది. మే నెల చివర్లో అమెరికా వెళ్లిన రజినీకాంత్.. ఇప్పటివరకూ ఇండియాకి రాలేదు. ఆయన హెల్త్ విషయంలో వస్తున్న గాసిప్స్.. ఇంత సుదీర్ఘ కాలం రజినీ అమెరికాలోనే ఉండడంతో మరింత ఎక్కువవుతున్నాయి.

కబాలి థియేట్రికల్ ట్రైలర్ ఇవ్వకపోవడానికి కారణం.. రజినీ పార్ట్ కి ఇంకా డబ్బింగ్ పూర్తికాకపోవడమే అని తెలుస్తోంది. ట్రైలర్ ని కట్ చేసినా.. వాయిస్ కి సంబంధించి యూనిట్ చేయగలిగింది ఏం లేదు. తెలుగులో అంటే మనో తో డబ్బింగ్ పూర్తి చేయచ్చు కానీ.. తమిళ్ విషయంలో ఆప్షన్ లేదు. అందుకే ట్రైలర్ ని కూడా విడుదల చేయకుండానే ఆడియో రిలీజ్ లు కంప్లీట్ చేసేశారని అంటున్నారు. అంటే.. రజినీ వస్తేనే కానీ ట్రైలర్ విడుదల కాదన్న మాట. అయితే.. ఒక్కసారి రిలీజ్ అయితే మాత్రం.. టీజర్ కి మించిన సెన్సేషన్స్ ని కబాలి సృష్టించడం ఖాయమనే అంచనాలున్నాయి.

kabali trailer , Kabali Theatrical Trailer Download on MaTelugu.Com , Rajini Kabali Trailer Teaser

ThanQ Visit Again.

Related Posts