‘బిచ్చగాడు’ సినిమాను రూ.30 లక్షలకే ఇచ్చిన విజయ్ ఆంటోనీ.. తన తర్వాతి సినిమా ‘సైతాన్’కు మాత్రం మంచి రేటు రాబట్టుకున్నాడు. ఎస్.వేణుగోపాల్ అనే డిస్ట్రిబ్యూటర్ రూ.2.05 కోట్లకు ‘సైతాన్’ ఏపీ-తెలంగాణ రైట్స్ సొంతం చేసుకున్నాడు. అంటే బిచ్చగాడు మీద ఆరేడు రెట్లు ఎక్కువ రేటు పలికిందన్నమాట ఈ సినిమా. ప్రదీప్ కృష్ణమూర్తి అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ‘సైతాన్’ ఓ సైకలాజికల్ థ్రిల్లర్. విజయ్ ఆంటోనీ మరో వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నాడిందులో. అరుంధతి నాయర్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని కూడా విజయ్ ఆంటోనీనే నిర్మిస్తుండటం విశేషం. జులై నెలాఖరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది
బిచ్చగాడు సైతాన్ గా వస్తున్నాడు

ThanQ Visit Again.