International Fleet Review In Vizag 2016



హుద్‌ హుద్‌ తుఫాన్ బీభత్సం నుంచి విశాఖపట్నం వాసులు 14 నెలల్లోనే తేరుకున్నారని, విశాఖ వాసుల స్ఫూర్తి అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. విశాఖపట్నంలో జరుగుతున్న అంతర్జాతీయ యుద్ధనౌక సమీక్షలో ఆదివారం పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ప్రసంగించారు. విశాఖపట్నం అందమైన నగరమని, ఈ నగరం తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. హుద్‌ హుద్‌ విలయం సృష్టించిన సమయంలో తాను విశాఖపట్నానికి వచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. విశాఖ వాసులకు స్ఫూర్తికి సెల్యూట్ అని పేర్కొన్నారు. అదేవిధంగా విశాఖపట్నంలో జరుగుతున్న అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష చరిత్రాత్మకమని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నౌకాదళానికి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఆయన తన ప్రసంగంలో ఏమన్నారంటే..
  • ఫ్లీట్ రివ్యూ (యుద్ధనౌకల సమీక్ష)ను అద్భుతంగా నిర్వహించిన నౌక దళానికి అభినందనలు
  • ఈ అద్భుత కార్యక్రమానికి ప్రపంచ నలుమూలల నుంచి ప్రతినిధులు వచ్చారు
  • తీరప్రాంత దేశాలతో ఆర్థిక, వాణిజ్య సంబంధాల బలోపేతానికి మారిటైమ్ ఉపయోగపడుతుంది
  • సముద్రాల ద్వారానే 90శాతం వాణిజ్యం కొనసాగుతోంది
  • సముద్వాల ద్వారా అంతర్జాతీయంగా 20 ట్రిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరుగుతోంది
  • సముద్ర మార్గ వాణిజ్యానికి సునామీ, తుఫాన్ వంటి ప్రకృతి వైపరీత్యాలు సవాలు విసురుతున్నాయి
  • అన్ని దేశాల నౌకాదళాలు భద్రతపై సమిష్టిగా దృష్టి సారించాలి
  • గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీ కోసం మేం బిలియన్ డాలర్లు ఖర్చు చేశాం
  • ఈ ఏడాది ఏప్రిల్‌లో గ్లోబల్ మారిటైమ్ సమ్మిట్ నిర్వహిస్తాం
  • తీరప్రాంత రాష్ట్రాలన్నీ యువతకు శిక్షణ ఇవ్వాలి
  • తీరప్రాంత భద్రత ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకం
  • భారత్ సముద్రతీర విధానాన్ని మారిషస్‌లో ఇటీవల ప్రకటించాం
  • భారత్‌కు 7,500 చదరపు కిలోమీటర్ల తీరప్రాంతముంది
  • సార్క్ దేశాలతో మన సంబంధాలు బాగున్నాయి
  • సింధు నాగరికత నాటి నుంచి ప్రపంచదేశాలతో భారత్‌కు సత్సంబంధాలు ఉన్నాయి.

ThanQ Visit Again.

Related Posts