ఏప్రిల్ 29న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఏపీ ఎంసెట్-2016 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తమ దరఖాస్తులు ఆధార్ నెంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేయాలని ఏపీ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. ఎంసెట్ నిర్వహణకు సంబంధించి ఈ నెల 11న ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశాన్ని జేఎన్టీయూకెలో నిర్వహించనున్నామని, దీనిలో 22 మంది ప్రాంతీయ సమన్వయకర్తలు పాల్గొంటున్నారన్నారు. ఇంజనీరింగ్, మెడికల్ అభ్యర్ధులు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా మార్చి 21 వరకు, రూ 500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 2వరకు, రూ.1000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 11 వరకు, రూ 5 వేల అపరాధ రుసుముతో ఏప్రిల్ 19 వరకు, రూ.10 వేలు అపరాధ రుసుముతో ఏప్రిల్ 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు www.apeamcet.org వెబ్‌సైట్‌లో గానీ, 0884 2356255, 2340535 నెంబర్లలోగానీ సంప్రదించాలన్నారు.