లండన్: బ్రిటన్ కు వలసవచ్చేవారు రెండు లేదా రెండున్నరేళ్ల లోపు ఇంగ్లీష్ నేర్చుకోకపోతే దేశంలో నివసించేందుకు అనుమతించబోమని ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ అన్నారు. బ్రిటన్ లో నివసించే దాదాపు లక్షా 90 వేలమంది ముస్లిం మహిళలకు ఇంగ్లీష్ రాదని చెప్పారు.ఓ వార్త పత్రికకు రాసిన వ్యాసంలో కామెరూన్.. ఇంగ్లీష్ ఆవశ్యకతను తెలియజేశారు. 'ఇంగ్లీష్ కొద్దిగా తెలుసుని బ్రిటన్ కు వలసరావచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడటం నేర్చుకోవాల్సిన అవసరముంది. భాషపై పట్టుసాధించకపోతే దేశంలో నివసించే అవకాశాన్ని కోల్పోతారు' అని పేర్కొన్నారు. కొన్ని మతాలకు చెందిన మహిళలకు ఇంగ్లీష్ భాష నేర్పించేందుకు బ్రిటన్ లో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.
'ఇంగ్లీష్ రానివారిని మా దేశంలో ఉండనివ్వం'
ThanQ Visit Again.
