ఈ మేరకు నిర్వహించిన వేలంలో పూణె జట్టు మహేంద్ర సింగ్ ధోనీ, అశ్విన్, రహానె, స్టీవెన్ స్మిత్‌లను కొనుగోలు చేసింది. ఇక రాజ్‌కోట్ జట్టు సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, మెక్ కల్లెమ్‌లను కొనుగోలు చేసింది. అజ్యింకే రహానె రూ.9.5 కోట్లు, అశ్విన్ రూ.7.5 కోట్లు, జడేజా రూ.9.5 కోట్లకు ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి.
IPL Draft: MS Dhoni to play for Pune; Raina goes to Rajkot
గత 8 ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నేతృత్వం వహిస్తున్న ధోని తొలిసారిగా వేరే జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టనున్నాడు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు దోషులను పేర్కొంటూ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలపై జస్టిస్ లోధా కమిటీ రెండేసి సంవత్సరాల నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రెండేళ్ల సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్న చెన్నై, రాజస్థాన్ ప్రాంచైజీల స్థానంలో ఆడేందుకు గాను ఈనెల ఎనిమిదో తేదీన ‘రివర్స్ బిడ్డింగ్' విధానంలో పుణే, రాజ్‌కోట్ జట్లను బీసీసీఐ ఖరారు చేసింది. వేలంపాటలో మొత్తం 50 మంది ఆటగాళ్లు ఉన్నారు. అందులో 33 భారతీయ ఆటగాళ్లు ఉండగా, 17 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మళ్లీ తిరిగి 2018లో జరగనున్న ఐపీఎల్‌లో పాల్గొంటాయి. పుణె జట్టును సంజీవ్ గోయెంకాకు చెందిన న్యూ రైజింగ్ సంస్థ సొంతం చేసుకోగా, రాజ్‌కోట్ జట్టును ఇంటెక్స్ మొబైల్స్ సంస్థ దక్కించుకుంది.
The ninth edition of the IPL is scheduled from April 9 to May 29, 2016.
ఏ జట్టుకు ఎవరు?
1st picks - MS Dhoni - Pune
Suresh Raina - Rajkot
2nd picks - Ajinkya Rahane - Pune
Ravindra Jadeja - Rajkot
3rd picks - R Ashwin - Pune
Brendon McCullum- Rajkot
4th picks - Steve Smith - Pune
James Faulkner - Rajkot
5th picks - Faf du Plessis - Pune
Dwayne Bravo - Rajkot
డ్రాఫ్టింగ్ తర్వాత ఏయే జట్టులో ఎవరెవరు:
పూణె: MS Dhoni (India), Ajinkya Rahane (India), R Ashwin (India), Steve Smith (Australia), Faf du Plessis (South Africa)
రాజ్‌కోట్: Suresh Raina (India), Ravindra Jadeja (India), Brendon McCullum (New Zealand), James Faulkner (Australia), Dwayne Bravo (West Indies)
Prices for each player in order of who they pick (This is not the actual money the player gets. He will be paid the same amount what he was getting from previous franchise)
1. Rs 12.5 crore (Dhoni, Raina)
2. Rs 9.5 crore (Rahane, Jadeja)
3. Rs 7.5 crore (McCullum, Ashwin)
4. Rs 5.5 crore (Smith, Faulkner)
5. Rs 4 crore (Du Plessis, Bravo)
Total: Rs 39 crore