దేముడు ఎవరు ? part 2

దేవుడెవరు ? అని నిర్ణయించే ముందు అసలు దేవుడనేవాడున్నాడా ? అన్న ప్రశ్నకు జవాబు దొరకాలి. దేవుడున్నాడు అని చెప్పడానికి సాక్ష్యాలు లేవు. అయితే దేవుడున్నాడు అనడానికి డైరెక్ట్గా సాక్ష్యమ్ లేకపోయినా సృష్టిని మనం పరిశీలిస్తే దేవుడున్నాడని అర్ధమవుతుంది . ఏదయినా లేదని రుజువయ్యేంతవరకు ఉన్నాదనే ఒప్పుకోవాలి కూడా . అందుకే ప్రజలు మూడు రకాలుగా విడిపోయారు. ఒకరు ఆస్తికులు అంటే అస్తిత్వం అంటే దేవుని ఉనికిని ఒప్పుకునేవారు . నాస్తికులు అంటే నా అంటే లేదు అని అర్ధం అస్తిత్వం లేదని అంటే దేవుని ఉనికి లేదని నమ్మేవాళ్ళను నాస్తికులంటారు. ఇక మూడో వర్గం హేతువాదులు. హేతువు అంటే కారణం లేదా రుజువు ఉంటేనే దేనినైన నమ్మేవాళ్ళు. అసలు దేవుడున్నాడా లేడా అన్న విషయం గురించి అసలు ఆలోచించని మూడో వర్గం కూడా ఉందనుకోండి. వాళ్ళతో ప్రశాంతత వుండదు. కాబట్టి వాళ్ళను పక్కన పెడదాం. దేవుడే లేకపోతే ఈ విశ్వం ఉండదని దేవుడు సర్వాంతర్యామి అని ఆస్తికులు అంటుంటే దేవుడు లేడని వాదించే వాళ్ళు నాస్తికులు. రుజువు చూపిస్తే దేవుడున్నాడని నమ్మటానికి మాకు కూడా అభ్యంతరం లేదనే వారు హేతువాదులు. దేవుడుని ఇంగ్లీష్ లో GOD అంటారు. “G “అంటే జెనరేట్ అంటే ఉత్పత్తి చేయడం అంటే సృష్టిని ప్రారంభించడం . “O” అంటే organize అంటే నిర్వహించడం సృష్టిని నిర్వహించడం.” D” అంటే destroy అంటే నాశనం చేయడం . ఈ మూడు పనులను చేయగలిగినవాడే GOD. తెలుగులో దేవుడు అలాగే దేవుడుని భగవాన్ అని కూడా అంటారు. భాగం అనగా స్త్రీ జననాంగం అని వాన్ అంటే పురుష జననాంగం అని అర్ధం. స్త్రీ , పురుషుల కలయిక వల్లనే ఈ సృష్టి నడుస్తునదని కొందరి అభిప్రాయం.
ThanQ Visit Again.

Related Posts