ఆంధ్రా నుంచి జాతీయ సెలెక్టర్ గా ఎంపికైన తొలి క్రికెటర్
భారత క్రికెట్ జట్టు ఎంపిక సంఘంలో తెలుగు వ్యక్తికి చోటు లభిచింది. బీసీసీఐ వార్షిక సభ్య సమావేశం(ఏజీఎం)లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన భారత మాజీ వికెట్ కీపర్ ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ ఎంపిక సంఘంలో సభ్యుడు కానున్నారు. రోజర్ బన్నీ స్థానంలో ప్రసాద్‌కు చోటు కల్పిస్తూ బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఆంధ్రా నుంచి జాతీయ సెలెక్టర్‌గా ఎంపికైన తొలి క్రికెటర్ గా ప్రసాద్ గుర్తింపు పొందాడు. ప్రస్తుతం ఆయన ఏసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. 6 టెస్టులు, 17 వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 1999-2000లో ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా తరపున అతడు ఆడాడు. వెంకటపతిరాజు తర్వాత భారత క్రికెట్ ఎంపిక సంఘంలో చోటు లభించిన వ్యక్తి ఎమ్మెస్కే ప్రసాదే కావడం గమనార్హం
ThanQ Visit Again.