మన www.iamyourrealfriend.com వెబ్సైట్ ఏ వ్యక్తికిగాని, పార్టీ కి కానీ అనుకూలమూ కాదు , అలా అని వ్యతిరేకము కాదు. ఎవరి ప్రైవేట్ జీవితాలు వారిని పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం అన్న శ్రీ శ్రీ గారి మాటల ప్రకారం మా ప్రశ్నలు, విమర్శలు వుంటాయి . అలా అని కేవలం విమర్శలే కాకుండా ఆ వ్యక్తుల గొప్పతనాన్ని , మంచితనాన్ని కూడా పోగుడుతాము. విమర్సలెప్పుడు నిర్మాణాత్మకంగా వుండాలి అన్నదే మా వెబ్ సైట్ ఉద్దేశ్యం. విమర్సించడానికైనా మెచ్చుకోవడానికైనా నేనెవర్ని అంటారు. I am your real friend
సలహా : - ప్రజలతో మమేకామై నిరంతరం ప్రజల కష్ట సుకాలలో పాలు పంచుకునే మీ మనస్తత్వం చాల ఆదర్సవంతమైంది. దీనిని కొనసాగించండి.
జగన్ అంటే జనం. జనం అంటే జగన్ . ఇంతగా జనంలో మమేకమైన నాయకుడు దేశంలోనే బహుశా వుండివుండకపోవచ్చు. జగన్ వున్నచోట చుట్టూ జనం వుంటారు. నిరంతరం జనం మధ్యే ఆయన జీవిస్తుంటాడు. జగన్ ది ఒక విలక్షనమైన వ్యక్తిత్వం. ఆయన ఎప్పుడు కూల్ గా ఉంటాడని ఆయన అభిమానులు అంటుంటారు. ఆయనకు ఆవేశం ఎక్కువని ఆయన ప్రత్యర్డులంటారు. ఎన్ని కష్టాలొచ్చినా పెదవుల మీద చెరగని చిరునవ్వు ఆయన సొంతం. పెద్ద నాయకులు పార్టీ నుండి వెళ్లిపోతుంటే మౌనంగా వుండిపోయాడె తప్ప వెల్లిపోతున్నవారిని ఆపే ఏ ప్రయత్నమూ చేయకపోవటాన్ని ఆయనకు ఆత్మ విశ్వాసం ఎక్కువని కొందరంటే, ఆయనకు అహం ఎక్కువని అందుకే వెళ్ళేవారిని పిలవలేదని కొందరంటారు. ఆయనలో వున్న ధైర్యం ఎంతో సోనియా గాంధీ లాంటి నాయకురాలిని వ్యతిరేకించినపుడే కనపడింది. అత్యంత అవినీతి పరుడు దేశం లోనే లేడని ప్రత్యర్డులంటే ప్రజలకు అండగా వుండే నాయకుడని అభిమానులంటారు. అటువంటి జగన్ గురించి ఆయన వ్యవహార సైలి గురించి నాకు కొన్ని సందేహాలు వున్నాయి . జననయకుడిగా జనాలకు నిజాలు తెలియబరచవలసిన అవసరం ఆయనకు వున్నాదని మన వెబ్సైట్ భావిస్తున్నది.
అందుకే ఈ ప్రశ్నలు ఆయనను అడుగుతున్నాం .
1. వేలకోట్ల రూపాయలు మీరు అవినీతి చేసి గడించారని ఎంతోమంది నమ్ముతున్నారు. మీరు ఈ రోజుకి దానిగురించి ఎందుకు సరిఅయిన వివరణ ఇవ్వడం లేదు ?
2. మీ తండ్రిగారి పార్దివదేహం ఉండగానే మీరు ముఖ్యమంత్రి అవడానికి సంతకాలు సేకరించారని మీ మీద ఆరోపణలు వున్నాయి. వాటి మీద మీరు గట్టిగా ఖండన ఇవ్వలేదు. (సంతకాలు సేకరించింది నేనే అని సత్తిబాబు స్వయంగా చెప్పాడు) కాని మీరెందుకు వివరణ ఇవ్వలేదు ?
3. మీ పార్టీ లో పెద్ద పెద్ద నాయకులు వెళ్లిపోతుంటే మీరు మౌనంగా ఎందుకు వుండిపోయారు ? ఒకవైపు చంద్రబాబు పవన్ కల్యాన్ ఇంటికి వెళ్లి మద్దతు కూడగట్టుకుంటున్నా సమయంలో మీకు అహంబావమా ? అతివిశ్వాసమా ?
4. ఎప్పుడు చంద్రబాబు మీద విమర్శలు చేస్తుంటారు. బాబు మీ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తుంటారు. దాన్ని కాదనం కాని మీరు నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే మీకు ప్రజల్లో గౌరవం పెరుగుతుంది కదా ? ఆ పని ఎందుకు చెయ్యరు ?
5. మీ తండ్రి గారు నమ్మిన వారి కోసం ఏది అయిన చేసేవారని అంటుంటారు. కాని మీరు ఎవర్నీ సరిగ్గా నమ్మరని అంటుంటారు. మీలో అబద్ర్రతా భావం ఎక్కువా ?
6. ముందు సమైఖ్యాంద్రకు సపోర్ట్ గా పార్లమెంట్ లో తెలుగుదేశం ఎం.పి ల నుండి ప్లకార్డులు తీసుకుని మరి ప్రదర్శించారు. తరువాత విడగొట్టడం అనేది కేంద్రం చేతిలో వుంది. సమన్యాయం అంటూ మాట మార్చారు. తరువాత పూర్తిగా సమైక్యవాదిగా మాట్లాడారు. పరిస్థితుల్ని అంచనా వేయడంలో విఫలమయ్యారా ?
7. సాక్షి పత్రికలో మీడియాలో మీ గురించి వ్యతిరేకంగా వార్తలు ఎందుకు రావు? అది జర్నలిజానికి మచ్చ కదా ?
8. నా తండ్రి మరణం మీద నాకు అనుమానాలున్నాయి అన్న మీరు ఈ విషయం గురించి సి.బి.ఐ తో దర్యాప్తునకు గతంలో డిమాండ్ చేసిన తర్వాత మరి ఆ విషయం గురించే మాట్లాడడంలేదెందుకు ?
9. మీ తండ్రి గారి మీద వ్యక్తిగత విమర్శలు చేసిన బొత్స సత్తిబాబు ను పార్టీలోకి ఎలా తీసుకున్నారు ?
10. తెలుగుదేశం కేంద్రమంత్రులు మంత్రి వర్గం నుండి బయటకు వచ్చేసినంత మాత్రాన మోడీ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమి వుండదు. కాబట్టి మోడీ బయపడి ప్ప్రత్యేక హోదా ఇచ్చేయడు. ఈ విషయం తెలిసి కూడా కేవలం చంద్రబాబు ని ఇరకాటంలో పెట్టాలనే ఉద్దేశ్యం తో తెలుగుదేశం మంత్రులను మంత్రివర్గం నుండి బయటకు వచ్చేయమని డిమాండ్ చేస్తున్నారని టి.డి.పి ఆరోపణలు నిజం కాదా ?