10 Questions to Power Star Pawan Kalyan

ప్రతి మనిషిలో మంచి, చెడు రెండూ వుంటాయి. మంచిని పొగడాలి. చెడుని విమర్శించాలి.
మన www.iamyourrealfriend.com వెబ్సైట్ ఏ వ్యక్తికిగాని, పార్టీ కి కానీ అనుకూలమూ కాదు , అలా అని వ్యతిరేకము కాదు. ఎవరి ప్రైవేట్ జీవితాలు వారిని పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం అన్న శ్రీ శ్రీ గారి మాటల ప్రకారం మా ప్రశ్నలు, విమర్శలు వుంటాయి . అలా అని కేవలం విమర్శలే కాకుండా ఆ వ్యక్తుల గొప్పతనాన్ని , మంచితనాన్ని కూడా పోగుడుతాము. విమర్సలెప్పుడు నిర్మాణాత్మకంగా వుండాలి అన్నదే మా వెబ్ సైట్ ఉద్దేశ్యం. విమర్సించడానికైనా మెచ్చుకోవడానికైనా నేనెవర్ని అంటారు. I am your real friend
సలహా : - ప్రజలతో మమేకామై నిరంతరం ప్రజల కష్ట సుకాలలో పాలు పంచుకునే మీ మనస్తత్వం చాల ఆదర్సవంతమైంది. దీనిని కొనసాగించండి.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే చాలు లక్షలాదిమంది అభిమానుల్లో పవర్ జెనరేట్ అవుతుంది . ఆయన వ్యక్తిత్వం విలక్షనమయినది . చాలా నిరాడంబరంగా వుంటాడు , నిజాయితి గా వుంటాడు . అతని మాటల్లో ఈ దేశం పట్ల అతని బాధ్యతను తెలుస్తుంటుంది . ముక్కుసూటిగా మాట్లాడతాడు . అతని మాటలు కొంతమందికి బాధ కలిగించినా , అతని మాటల్లో నిజం వుంటుంది. ఆవేశం అతనిలో ఎక్కువ. చిరంజీవి లా లౌక్యం గా మాట్లాడలేడు లేదా మాట్లాడడు. కొన్నిసార్లు తీవ్రంగా స్పందిస్తాడు , కొన్నిసార్లు నిశ్శబ్దాన్ని పాటిస్తాడు . పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని అభిమానించే వాళ్ళలో నేనూ ఒకడ్ని . ఎవరి నుండి ఏమీ ఆశించడు. అది నాకు బాగా నచ్చింది . అధికారం కోసం కాదు ప్రశ్నించడం కోసం జనసేన ఏర్పాటు చేసానని ప్రకటించిన పవర్ స్టార్ ను మన వెబ్సైటు ద్వారా ప్రశ్నించాలని అనుకుంటున్నాము . ఆ ప్రశ్నలు అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కావు . అతని పెళ్ళిళ్ళు , పెటాకులు అది అతని వ్యక్తిగతం . వాటితో మాకు పని లేదు . మిగతా విషయాల్లో కొన్ని సందేహాలు ఉన్నాయి.



Pawan Kalyan


ఆయన మా ప్రశ్నలకు నిజాయితీగ సమాధానాలు ఇస్తారనే నమ్మకంతో ఈ పది ప్రశ్నలు ఆయన ముందుంచుతున్నాం .

1 . మీరు మీ స్వంత డబ్బు కోటి రూపాయల ఫండ్ తో ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసారు. ఆ ట్రస్ట్ ప్రస్తుతం వున్నదా ?లేదా ? ఆ ట్రస్ట్ ఏ ఏ కార్యక్రమాలు చేసింది ?
2. సమైక్యాంద్ర ఉద్యమం జరుగుచున్న రోజుల్లో మీరు ఉద్యమంలో ఎందుకు పాల్గొనలేదు? అప్పటికే మీరు రాజకీయాల్లోకి వచ్చేసారు . ఇంతకీ మీరు సమైక్యవాదులా ? తెలంగానావాదులా ? ఇప్పటికి మీరు చెప్పలేదు ఎందుకు ?
3. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజిస్తున్న కాలంలో మీ సోదరుడు మే సోదరుడు చిరంజీవి గారు కేంద్రమంత్రిగా వున్నారు . మీ సోదరునితో ఏ రోజైనా ఈ విభజన గురించి చర్చించారా ?
4. నా ముందు ఇద్దరు నాయకులు వున్నారు. ఒకరు చంద్రబాబు ఇంకొకరు జగన్. ఇద్దరిలో ఒకరికి సపోర్ట్ ఇవ్వాలనుకున్నాను. చంద్రబాబు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసారు, ఆయనకు అనుభవం వుంది. అనుభవమైన నాయకుడు మనకు కావాలనే ఉద్దేశ్యంతో చంద్రబాబుకు సపోర్ట్ చేస్తానన్నారు .మరి మీ సోదరులు ప్రజారాజ్యం స్థాపించినపుడు ఇద్దరు అనుభవమైన నాయకులు ఒకరు రాజశేఖర్ రెడ్డి గారు ఇంకొకరు చంద్రబాబు గారు. మరి ఇద్దరు అనుభవమైన నాయకులుండగా అనుభవం లేని మీ అన్నయ పార్టీ ఎందుకు పెట్టారు ? మీరు ఆ పార్టీ లో ప్రధమ భూమిక ఎందుకు పోషించారు ?
5. చిరంజీవి దగ్గర బంధువు బెడ్ రూమ్ లో పరుపు క్రింద కోట్ల రూపాయలు దొరికిపోతే మీరెందుకు మిన్నకుండిపోయారు ? ఆ విషయం గురించి ఎందుకు ప్రశ్నించ లేదు ?
6. ఓటుకు నోటు కేసులో మన ముఖ్యమంత్రి గారు ఆడియో, వీడియో లో దొరికిపోతే ఆ విషయం గురించి ఎందుకు ప్రశ్నించలేదు ? చంద్రబాబుది కరెక్ట్ అని మీరు అనుకుంటే ఫోన్ ట్యాప్ చేసినందుకు కే.సి.ఆర్ ని ప్రశ్నించాలి కదా ?
7. గోదావరి పుష్కరాల్లో 29 మంది మరణిస్తే ఇది ఒక దురదృష్టకరమైన సంగటన అని అన్నారు కానీ దీని మీద న్యాయ విచారణకు ఎందుకు డిమాండ్ చేయలేదు ?
8. ఇటు ఆంధ్రా అటు తెలంగాణా రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే రెండు ప్రభుత్వాలను ఎందుకు ప్రశ్నించడం లేదు ?
9. శివాజీ లాంటి చిన్న హీరో ప్రత్యెక హోదా కోసం ఉద్యమం చేస్తుంటే మీరెందుకు సైలెంట్ గా వున్నారు? మీరు తలచుకుంటే ప్రధానమంత్రితో అయనా చర్చించగలరు . మీరు ఆ ప్రయత్నం చేసారా ? అసలు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగారా ? అడిగిన అతను ఇవ్వలేదా ?
10. ఈ మద్య ప్రభాస్ ఫాన్స్ , మీ ఫాన్స్ కొట్లాటకు దిగారు. 144 సెక్షన్ కూడా విదించారు. మరి సముదాయించవలసిన అవసరం మీ ఇద్దరికీ లేదా ?
ThanQ Visit Again.

Related Posts