Showing posts with label Prabhudeva. Show all posts
Showing posts with label Prabhudeva. Show all posts

తమన్నా ప్రభుదేవా బార్యాభర్తలుగా అభినేత్రి మూవీ



తెలుగు - తమిళ్ - హిందీ.. మూడు భాషల్లో విడుదల కానున్న అభినేత్రి చిత్రంపై అన్ని చోట్లా అంచనాలు బాగానే ఉన్నాయి. అంచనాల సంగతేమో కానీ.. అభినేత్రిపై అందరి కంటే ఎక్కువ ఆశలు పెట్టుకున్నది మాత్రం హీరోయిన్ తమన్నానే. సౌత్ తో పాటు నార్త్ లోనూ క్రేజ్ ఉన్నా.. అవేవీ మంచి అవకాశాలు మారని పరిస్థితి మిల్కీది. అందుకే అభినేత్రితో తనలోని ట్యాలెంట్ చూపించేందుకు.. తన రెమ్యూనరేషన్ ని భారీగా తగ్గించేసుకుని మరీ ఈ సినిమా చేసిందని టాక్. 

ఇప్పటికే తమన్నా రెండు రకాల గెటప్ లలో కనిపిస్తున్న ఫోటోలతో ఆసక్తి బాగానే కలిగించారు. తమ్మూ డ్యుయల్ రోల్ చేస్తోందా అనే డౌట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు వీటన్నిటికీ క్లారిటీ ఇచ్చేస్తూ.. అభినేత్రి స్టోరీ చెప్పేశాడు హీరో ప్రభుదేవా. 'భార్యాభర్తల మధ్య అనుబంధం చుట్టూ తిరిగే స్టోరీ ఇది. అభినేత్రి ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. తమన్నా-నేను భార్యాభర్తలుగా కనిపిస్తాం. కట్టుకున్నదాని అందం పట్టించుకోకుండా ప్రపంచంలో ఉన్న ఇతర అందాలవైు చూసే భర్త రోల్ నేను చేశాను. చివరకు నా భార్య అందాన్ని ఎలా గుర్తించానన్నదే అసలు పాయింట్. అభినేత్రికి స్క్రీన్ ప్లే.. నెరేషన్ హైలైట్స్ అవుతాయి' అని చెప్పాడు ప్రభుదేవా. 

హిందీలో 2 ఇన్ 1.. తెలుగులో అభినేత్రి.. తమిళ్ లో దేవి(ల్) పేరుతో ఈ మూవీ సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. మరి ముప్ఫై లక్షలకు రెమ్యూనరేషన్ తగ్గించుకుని మరీ ఈ సినిమా చేసిన మిల్కీ బ్యూటీ.. గంపెడన్ని ఆశలతో ఎదురుచూస్తోంది.