Showing posts with label Pak. Show all posts
Showing posts with label Pak. Show all posts

ఇంగ్లీష్ మాట్లాడాడని పాక్ ప్రధాని షరీఫ్‌పై కేసు

కరాచీ: అధికార భాషను కాకుండా ఇంగ్లీషులో మాట్లాడినందుకు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పైన పాకిస్థాన్ సుప్రీం కోర్టులో కేసు నమోదైంది. 70వ ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో షరీఫ్ ఇంగ్లీషులో మాట్లాడారని, ఇది పాకిస్తాన్ ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకమని జహీద్ ఘనీ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో, కేసు నమోదుకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు డాన్ పత్రిక వెల్లడించింది. ఇవే సమావేశాల్లో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆ దేశ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హిందీలో మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. రష్యన్ భాషలో వ్లాదిమిర్ పుతిన్, చైనా భాషలో జిన్ పింగ్, జపాన్ భాషలో షింజో అబేలు ప్రసంగిస్తే... నవాజ్ షరీఫ్ మాత్రం పాకిస్తాన్ అధికార భాషను కాకుండా ఇంగ్లీషులో మాట్లాడటం, జాతికే అవమానకరమన్నాడు. ఇది తీవ్రమైన నేరమని, విచారించి శిక్షించాలని జహీద్ కోరాడు. కాగా, నవాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయిన సమయంలో.... తాను మాట్లాడటం కంటే, ఒబామా చెప్పిందే ఎక్కువగా వినేందుకు ప్రయత్నాలు చేశాడని తెలుస్తోంది. మరోవైపు, అమెరికా పర్యటించిన పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు రెండు రోజుల క్రితం నిరసన సెగ తగిలింది. తన సొంత దేశం బెలూచిస్థాన్‌కు చెందిన ఓ నిరసనకారుడు షరీఫ్‌ను ఘెరావ్ చేశాడు. అమెరికాలోని ప్రముఖ మేధో సంస్థ యూఎస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పీస్‌లో ప్రసంగిస్తున్న సమయంలో ఇది జరిగింది. బెలూచిస్థాన్‌కు విముక్తి కల్పించండనే నినాదంతో ఆందోళనకు దిగిన నిరసనకారుడు... నువ్వూ లాడెన్ స్నేహితుడివేనంటూ షరీఫ్‌ పైన మండిపడ్డాడు. ఊహించని పరిణామంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది తేరుకుని అతడిని బయటకు తీసుకెళ్లారు.


Pakistan's Prime Minister Nawaz Sharif speaks during a news conference with Thailand counterpart Yingluck Shinawatra (not pictured) at the Prime Minister's residence in Islamabad August 20, 2013. REUTERS/Mian Khursheed (PAKISTAN - Tags: CIVIL UNREST POLITICS)

మహిళలకు పూర్తి ముసుగు తప్పనిసరికాదు: పాక్

పాకిస్థాన్ రాజ్యాంగ సంస్థ కీలక నిర్ణయం వెలువరించింది. ముస్లిం మహిళలు శరీరం మొత్తం అగుపించకుండా ఉండేలా ముసుగు ధరించడం తప్పనిసరి కాదని పాకిస్థాన్ రాజ్యాంగ సంస్థ పేర్కొంది. మౌలానా మహ్మద్ ఖాన్ షెరానీ అధ్యక్షతన ఇస్లామిక్ ఐడియాలజీ కౌన్సిల్ సోమవారం సమావేశమైంది. ముఖం, చేతులు, పాదాలు కనిపించకుండా ఉండే విధంగా మహిళలు వస్ర్తాలు ధరించాల్సిన అవసరం లేదన్న నిర్ణయానికి కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ ఆమోదం తెలిపింది. ముస్లిం మహిళలు పూర్తిగా ముసుగు ధరించడం తప్పనిసరికాదన్న నిర్ణయానికి సమావేశంలో ఎక్కువ మంది మద్దతు తెలపడంతో సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Muslim Girls

ఈ మేరకు సమావేశం అనంతరం అధ్యక్షుడు మౌలానా మీడియాతో మాట్లాడుతూ.. మహిళలు మణికట్టు వరకు దుస్తులు ధరించాల్సిన నిర్భందం ఏమిలేదని తెలిపారు. విలువలను పాటించేలా వస్త్రధారణ ఉంటే బాగుంటుందని చెప్పారు. అల్లర్ల నుంచి తప్పించుకునేందుకు ముఖంతో పాటు శరీరాన్ని మొత్తం కప్పి ఉంచేలా వస్త్రధారణ ఉంటే మంచిదన్నారు. అయితే, 'ఎటువంటి అలర్లు' అని అడిగితే మాత్రం సమాధానం చెప్పలేకపోయారు.