Showing posts with label Loafer. Show all posts
Showing posts with label Loafer. Show all posts

సమీక్ష : లోఫర్ మూవీ రివ్యూ - వరుణ్ తేజ్ - పూరి జగన్నాధ్

Loafer Telugu Movie Review

విడుదల తేదీ : 17 డిసెంబర్ 2015
రేటింగ్ : 3/5
దర్శకత్వం : పూరి జగన్నాధ్
నిర్మాత : సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్‌, తేజ
సంగీతం : సునీల్ కశ్యప్
నటీనటులు : వరుణ్ తేజ్, దిశా పటాని, రేవతి, పోసాని కృష్ణమురళి

‘ముకుంద’ సినిమాతో హీరోగా పరిచయమై ఈ ఏడాది కంచె’ అనే సినిమాతో నటుడిగా తనకి తాను గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ మూడవ ప్రయత్నంగా ట్రై చేసిన మాస్ మసాలా ఎంటర్టైనర్ ‘లోఫర్’. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా దిశా పటానిని హీరోయిన్ గా పరిచయం చేసారు. వరల్డ్ వైడ్ గా ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది? వరుణ్ తేజ్ మాస్ హీరోగా ఎలా చేసాడు? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

కథ :

లక్ష్మీదేవి(రేవతి) – మురళి (పోసాని కృష్ణమురళి) భార్య భర్తలు. వీళ్ళ అబ్బాయే మన హీరో రాజా(వరుణ్ తేజ్). మురళి ఓ దొంగ, లక్ష్మీదేవి ఆస్తి మీద కన్నేసి పెళ్లి చేసుకుంటాడు, పిల్లాడు పుట్టాక ఆస్తి తీసుకురమ్మంటే లక్ష్మీదేవి నో అంటుంది. దాంతో గొడవ.. పోసాని వరుణ్ ని తీసుకొని జోద్ పూర్ వెళ్ళిపోతాడు. పోసాని వరుణ్ ని తన కన్నా పెద్ద లోఫర్ గా, దొంగగా పెంచుతాడు. అలా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న వరుణ్ ఓ సారి ఇంట్లో వాళ్ళు చేసే పెళ్లి ఇష్టం లేక పారిపోయి వచ్చిన పారిజాతం (దిశా పటాని)ని చూసి ప్రేమలో పడతాడు. పారిజాతం కూడా వరుణ్ ప్రేమలో ఉన్న టైంకి పారిజాతంని తన ఫాదర్ అయిన ముఖేష్ (ముఖేష్ ఋషి) మనుషులు తీసుకెళ్ళడానికి వస్తారు.
అక్కడే అసలైన ట్విస్ట్.. కట్ చేస్తే పారిజాతంని వెతుక్కుంటూ రాజా వెళ్తాడు. పారిజాతంని కాపాడడం కోసం రాజా లక్ష్మీ దేవితో కలిసి ఉండాల్సి వస్తుంది. పారిజాతంని కాపాడే ప్రక్రియలో రాజా తెలుసుకున్న నిజాలేమిటి? దానికోసం అతను ఎందుర్కున్న ఇబ్బందులేమిటి? కథలో అసలైన ట్విస్ట్ ఏంటి? లక్ష్మీదేవి రాజా చెడ్డవాడని తెలిసినా ఎందుకు హెల్ప్ చేస్తుంది? ఫైనల్ గా అసలు ఎవరి ద్వారా లక్ష్మీదేవికి రాజా తన సొంత కొడుకని తెలుస్తుంది? అన్నదే మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిన కథ.

ప్లస్ పాయింట్స్ :

పూరి జగన్నాధ్ సినిమా అనగానే ప్రేక్షకులు మూడు విషయాలు ఆశిస్తారు.. అవి ఆడియన్స్ కి ఇట్టే కనెక్ట్ అయీపొయే హీరో మాస్ క్యారెక్టరైజేషణ్, మాస్ డైలాగ్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్. వారు ఆశించే ఆ మూడు అంశాలే ఈ సినిమాకి ప్రధాన హైలైట్స్. ఈ సినిమాలో పూరి వీటితో పాటు సెంటిమెంట్ ని కూడా బాగానే దట్టించాడు. సెకండాఫ్ లో వర్కౌట్ అయిన కొన్ని ఎమోషనల్ సీన్స్ సినిమాలో అదనపు బోనస్ కింద చెప్పుకోవాలి. హీరో ఇంట్రడక్షన్ నుంచే వరుణ్ పాత్రకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వడంతో సినిమా అలా అలా సాగిపోతుంది. ఆడియన్స్ కి ఇంటర్వల్ బ్లాక్ మంచి కిక్ ఇస్తే, సెకండాఫ్ లో వచ్చే కొన్ని మదర్ సెంటిమెంట్ సీన్స్ ఆడియన్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. వరుణ్ తేజ్ కి పుల్ మాస్ ధోరణిలో సాగే పాత్ర చేయడం కొత్తయినప్పటికీ చాలా అంటే చాలా బాగా చేసాడని చెప్పాలి. మెయిన్ గా పూరి మార్క్ డైలాగ్స్ ని డెలివర్ చేయడంలో, హీరో పాత్రలో మానరిజమ్స్ ని చూపించడంలో సూపర్బ్ అనిపించుకున్నాడు. పూరి కూడా వరుణ్ తేజ్ లోని మాస్ యాంగిల్ ని పర్ఫెక్ట్ గా తెరపై స్క్రీన్ పై చూపించి వరుణ్ ని ఆడియన్స్ కి మరింత దగ్గర చేసాడు. ముఖ్యంగా వరుణ్ కటౌట్ ని ఫైట్స్ లో చూపించిన విధానం బాగుంది. మొదటి రెండు సినిమాలతో పోల్చుకుంటే ఇది వరుణ్ తేజ్ ఏనా అని చాలా మంది షాక్ అయ్యేలా వరుణ్ తేజ్ వేరియేషణ్ చూపించాడు. ఇక హీరోయిన్ దిశా పటాని నార్త్ ఇండియన్ బ్యూటీ అయినా డైలాగ్ డెలివరీ మరియు హావ భావాల విషయంలో ది బెస్ట్ అనిపించుకుంది. ఇక గ్లామర్ పరంగా అయితే మోడ్రన్ లుక్ లో కనిపిస్తూ, తన అందాలతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘జియా జలే’ సాంగ్ లో తడిసిన బట్టల్లో దిశాని చూపిన విధానం గ్లామర్ ట్రీట్ అని చెప్పాలి. పక్కా లోఫర్ పాత్రలో పోసాని కృష్ణమురళి మెప్పించాడు. ముఖ్యంగా పూరి మార్క్ సెటైరికల్ డైలాగ్స్ పోసాని చెప్పిన తీరు సూపర్. ఇక రేవతి మదర్ గా సినిమాకి ప్రాణం పోశారు. ముఖ్యంగా వరుణ్ – రేవతి కాంబినేషన్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ మాత్రం అందరినీ టచ్ చేస్తాయి. ఇక విలన్ గా ముఖేష్ ఋషి,చరణ్ దీప్, శాండీలు మంచి పోటీని ఇచ్చారు. బ్రహ్మానందం, అలీ, సప్తగిరి, ధనరాజ్ లు ఓ నాలుగు సీన్స్ లో నవ్వించే ప్రయత్నం చేసారు.

మైనస్ పాయింట్స్ :

పూరి జగన్నాధ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్ట్రాంగ్ కంటెంట్ ని ఎంచుకోవడం లేదు, ఓక చిన్న పాయింట్ ని తీసుకొని దానిని హీరో క్యారెక్టరైజేషణ్ తో అల్లుకుంటూ వచ్చేస్తున్నాడు. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ సీన్స్ అనేవి మెయిన్ పాయింట్ అయితే మిగతా అంతా తన రొటీన్ ఫ్లేవర్ లోనే ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే పూరి చాలా సినిమాల మాదిరిగానే ఉంటుంది. అదీ కాక ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ కూడా పెద్దగా లేదు. సినిమాలో ఎక్కువ భాగం సందర్భానుసారంగా వచ్చే కామెడీని రన్ చేయాలని చూసాడు, అది కొన్ని చోట్ల మాత్రమే హిట్ అయ్యింది, చాలా చోట్ల ఫెయిల్ అయ్యింది.
వీటన్నికంటే మించి పూరి చేసిన మెయిన్ మిస్టేక్ సినిమా మొదటి సీన్ లోనే కథ మొత్తాన్ని చెప్పేయడం, అలాగే స్క్రీన్ ప్లే కూడా ఎలా మొదలై ఎలా ఎండ్ అవుతుంది అనేది చెప్పెయడమే. ఇక సెకండాఫ్ లో ఎక్కువ భాగం సెంటిమెంట్ మీదకి కథ టర్న్ అవుతుంది, దాంతో సెకండాఫ్ ని మొదలు పెట్టడం బాగున్నా, ఓ 20 నిమిశాలా తర్వాత ఫ్లో మొత్తం పడిపోతుంది. అలాగే సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ అనేది అస్సలు ఉండదు. చెప్పాల్సిన పాయింట్ ఏమీ లేకపోవడం వలన, ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ అవడం వలన సెకండాఫ్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. సినిమా స్లోగా ఉండడంతో ఆ ఫ్లోని అడ్డంగా కట్ చేసి క్లైమాక్స్ లోకి వచ్చేసినట్టు అనిపిస్తుంది.
సాంకేతిక విభాగం :
పూరి జగన్నాధ్ కి హెల్ప్ అయిన టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ చాలానే ఉన్నాయి.. ముందుగా పిజి విందా జోద్ పూర్, రాజస్థాన్ లొకేషన్స్ ని చాలా చాలా బాగా చూపించాడు. అలాగే మన తెలుగు ఆడియన్స్ కి ఆ లొకేషన్స్ కొత్త కావడం వలన విజువల్స్ చాలా ఫ్రెష్ ఫీల్ ని ఇస్తాయి. ఇక సునీల్ కశ్యప్ అందించిన పాటలు మాస్ ఆడియన్స్ వరకూ ఓకే పిక్చరైజేషన్ కూడా వారిని ఆకట్టుకునేలా ఉంది. ఇక సునీల్ కశ్యప్ అందించిన నేపధ్య సంగీతం మాత్రం సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయ్యిందని చెప్పాలి. హీరో ఎలివేషన్ మరియు సెంటిమెంట్ సీన్స్ లో రీ రికార్డింగ్ అదిరింది. విఠల్‌ కోసనం ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. ఎస్ఆర్ శేఖర్ తనకిచ్చిన పార్ట్ ని ఉన్నంతలో బాగానే చేసాడు, కానీ కథ, చెప్పిన విధానం రెగ్యులర్ గా ఉండడం వలన అక్కడక్కడా సాగాదీత కనిపిస్తుంది. విజయ్ యాక్షన్ ఎపిసోడ్స్ డీసెంట్ అనిపిస్తాయి. కానీ పొలం ఫైట్ సీన్ మాత్రం సూపర్బ్.
ఇక ఎప్పటిలానే కథ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం విభాగాలను పూరి జగన్నాధ్ డీల్ చేసాడు. కథలో ఓ కొత్తదనం లేకపోయినా పాత్రలని కొత్తగా చూపించడంలో ఎమోషనల్ సీన్స్ రాసుకోవడంలో పూరి సక్సెస్ అయ్యాడు. ఇక స్క్రీన్ ప్లే పరంగా మాత్రం పెద్ద ఆసక్తిని క్రియేట్ చేయలేకపోయాడనే చెప్పాలి. మొదటి సీన్ లో సినిమా కంటెంట్ మొత్తాన్ని చెప్పేయడం సినిమాకి మైనస్. అదీకాక సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేదు. ఎప్పటిలానే డైలాగ్స్ మాత్రం పూరి గన్ నుంచి పేలిన తూటాల్లా పేలాయి. ఇక డైరెక్టర్ గా ఆద్యంతం ప్రేక్షకులను రంజింపజేయలేకపోయినా ఓవరాల్ గా పరవాలేదనిపించే మాస్ మసాలా బొమ్మ అనుకునేలా మాత్రం చేసాడు. సికె ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు మాత్రం బాగా రిచ్ గా ఉన్నాయి.

తీర్పు :

బ్యాక్ టు బ్యాక్ క్లాస్ ఎంటర్టైనర్స్ తర్వాత వరుణ్ తేజ్ నుంచి వచ్చిన ఈ ‘లోఫర్’ సినిమా ముందుగా వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్ పరంగా అందరూ సూపర్ అనేలా చేస్తుంది. సినిమా పరంగా డీసెంట్ పూరి మార్క్ మాస్ మసాలా మూవీ అనిపించుకుంటుంది. లుక్, డైలాగ్ డెలివరీ, మాస్ పెర్ఫార్మన్స్ తో వరుణ్ తేజ్ అందరినీ సర్ప్రైజ్ చేస్తాడు అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ సినిమాకి మొదటి పిల్లర్ వరుణ్ తేజ్ అయితే, సెకండాఫ్ లో వచ్చే కొన్ని సెంటిమెంట్ సీన్స్ మరియు ఇంటర్వల్ బ్లాక్ సినిమాకి రెండవ పిల్లర్ గా నిలిచాయి. పూరి ప్రతి సినిమాల్లో కనిపించే స్టైల్ లోనే సాగే కథ, కథనం సినిమాకి మైనస్. పూరి మార్క్ సినిమాలకి బాగా అలవాటు పడిన వారికి ఈ సినిమా బాగానే కనెక్ట్ అవుతుంది. కానీ మిగతా వారికీ అంతలా కనెక్ట్ అవ్వకపోవచ్చు. దానికి ప్రధాన కారణం సినిమాలో ఎంటర్టైన్మెంట్ కొరవడడమే. ఓవరాల్ గా లోఫర్ సినిమా బేసిక్ టైం పాస్ కోసం చూసే సినిమా లవర్స్ ఓ సారి చూడదగిన మాస్ మసాలా మూవీ.

Varun Tej Loafer (2015) Telugu Movie Mp3 Songs Download

Puri Jagannadh Loafer (2015) Telugu Movie Full Mp3 Songs Download

Loafer Movie Songs Download

01 – Nokkey Dochey
Singer(s) :Sri Sunil Kasyap ,Spruthi

02 – Nuvvedusthunte
Singer(s):Yazin Nizar

03 – Jiya Jile
Singer(s) :Yazin Nizar,Pranavi

04 – Suvvi Suvvalamma
Singer(s):Karunya

05 – Chutta Beedi
Singer(s):Rahul,Shravana Bhargavi

Loafer [2016] Telugu Movie Full Mp3 Songs 320 Kbps Download on MaTelugu.Com


Loafer_Movie_Tracklist

Movie Information
Movie : Loafer (2015)
Cast: Varun Tej , Disha Patani
Music : Suneel Kashyap
Lyrics : Bhaskara Bhatla
Producer : CV Rao , Shwetha Lana
Director : Puri Jagannadh

Loafer/ Lofer Telugu Movie Trailer – Puri Jagannadh , Varun Tej

Loafer/ Lofer Telugu Movie Trailer

Loafer is an Upcoming Telugu Movie which is Director by Tollywood ono of the Top Director Puri Jagannadh. The Story and Dialogs of this movie is written by Puri HilmSelf and This will be his Second movie which is going to release in this year after his Blockbuster movie Temper which released in the same year.

Movie Information : -

Director: Puri Jagannadh
Producer: C. Kalyan
Written: Puri Jagannadh
Screenplay: Puri Jagannadh
Story: Puri Jagannadh
Starring: Varun Tej, Disha Patani
Music: Sunil Kashyap
Cinematography: P.G. Vida
Production company: C. K. Entertainments & Sree Subha Swetha Films
Country: India
Language: Telugu

loafer-lofer-telugu-movie

Loafer/ Lofer Telugu Movie Trailer
The main Lead roles in this movie are played by Varun Tej and Disha Patani and she is the Debut actress who is making her First Movie entry with this Film. This is the Third Film of Varun Tej and this movie Varun will be seen in a complete new Look. C.Kalyan is Producing this movie under his own Production Company C.K Entertainments along with Sree Subha Swetha Film