Showing posts with label Kalam Na Preyasi. Show all posts
Showing posts with label Kalam Na Preyasi. Show all posts

Suriya 24 movie Kalam Na Preyasi Song Download



Suriya 24 movie Kalam Na Preyasi Song Download on MaTelugu.Com

కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ ఇప్పుడు 24 మూవీపై బోలెడన్ని అంచనాలు ఉన్నాయి. తమిళ స్టార్ హీరో సూర్య - మనం ఫేం దర్శకుడు విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సైంటిఫిక్ థ్రిల్లర్.. టీజర్ తర్వాత ఎక్స్ పెక్టేషన్స్ ను మరింతగా పెంచేసింది. ఇప్పుడీ మూవీకి ఓ సింగిల్ ను రిలీజ్ చేసింది యూనిట్. ఏప్రిల్ 15న విడుదల కాబోయే ఈ చిత్రానికి - ప్రమోషన్స్ ఇప్పుడు తారా స్థాయికి చేరుకున్నాయి.

24 మూవీకి ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. రెహ్మాన్ మ్యూజిక్ లో 'కాలం నా ప్రేయసి' అంటూ సాగే ఓ పాటను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ పాటనను చంద్రబోస్ రాయగా.. బెన్నీ యాళ్ పాడాడు. టెక్నో బీట్ తో సాగే ఈ సాంగ్.. లిరిక్ పరంగా - మ్యూజిక్ పరంగా విపరీతంగా ఆకట్టుకుంటోంది. పాటలో కూడా కాలంకు సంబంధించిన వర్డింగ్ ని పర్టిక్యులర్ గా అబ్జర్వ్ చేయచ్చు.

ఇప్పటికే పోస్టర్లలో - టీజర్ లో గడియారం చూపించి - వేరీజ్ మై వాచ్ అని హీరోతో అనిపించి.. ఇది కాలంలో జర్నీ చేసే సినిమా అని డైరెక్టర్ ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు. ఈ సైఫై చిత్రంలో సూర్యకి జంటగా సమంతా - నిత్యామీనన్ లు నటించారు. సూర్య మూడు విభిన్న పాత్రలతో కనిపించనుండడం విశేషం.