Showing posts with label Guntur. Show all posts
Showing posts with label Guntur. Show all posts

పుట్టిన వెంటనే ఆధార్ కార్డు జారీ ప్రారంభమైన కొత్త పధకం




గుంటూరులో అప్పుడే పుట్టిన పిల్లలకు ఆధార్ కార్డు జారీ

తొలి రోజు ఐదుగురు పిల్లలకు కార్డులు
విజయవంతమైతే ఏపీ అంతటా అమలు
ఆధార్‌ సీడింగ్‌ కన్సల్టెంట్‌ కుల్వంతసింగ్‌ చావ్లా
గుంటూరు(సంగడిగుంట): గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఇకపై శిశువు పుట్టిన వెంటనే ఆధార్‌ నంబర్‌ను అందించనున్నట్లు ఆధార్‌ సీడింగ్‌ కన్సల్టెంట్‌ కుల్వంత సింగ్‌ తెలిపారు. పైలెట్‌ ప్రాజెక్టుగా ఈ ప్రక్రియను ఆయన బుధవారం జీజీహెచలో ప్రారంభించారు. ఇప్పటి వరకు హర్యానాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. కొద్దిరోజుల్లోనే విజయవాడ, రాజమండ్రిల్లో కూడా ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. పుట్టిన వెంటనే ఆధార్‌ ఎనరోల్‌ నంబర్‌ కేటాయిస్తామన్నారు. పేరు తెలిపితే దానిని కూడా జతపర్చి అందిస్తామన్నారు. బిడ్డకు ఐదో సంవత్సరం వచ్చిన తరువాత వేలిముద్రలు, కంటి ఐరి్‌షలు తీసుకుని పూర్తి ఆధార్‌ను కేటాయిస్తామన్నారు. తొలిరోజు ఐదుగురు శిశువులకు దీనిని అందించారు. వైద్యులకు ప్రోత్సాహం కింద ఒక్కో బిడ్డకు రూ.25 అందిస్తామన్నారు. ఇప్పటికే జీజీహెచలో పుట్టిన బిడ్డలకు అక్కడే జనన ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తున్నారు. ఆధార్‌ కూడా అందించడంతో తల్లిదండ్రులకు వ్యయప్రయాసలు తగ్గుతాయని వైద్యాధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజునాయుడు, డీఎంహెచవో డాక్టర్‌ పద్మజారాణి తదితరులు పాల్గొన్నారు.
దేశ పౌరసత్వ కార్డులు... అమెరికా అమలు చేస్తున్న గ్రీన కార్డు తరహాలో సమీప భవిష్యత్తులో దేశంలో పుట్టే బిడ్డలకు అదే రోజు భారత పౌరసత్వ గుర్తింపు కార్డు(నేషనల్‌ ఐడెంటిటి కార్డు) జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. భవిష్యత్తులో అన్ని అవసరాలకు ఈ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ కార్డు నెంబర్‌ను నేషనల్‌ పాపులేషన్ రిజిసే్ట్రషన(ఎనపీఆర్‌)లో నమోదు చేస్తారు. ఫలితంగా శాశ్వత గుర్తింపుతో పాటు దేశ జనాభా కచ్చితంగా తెలుస్తుంది. ఈ ఆలోచనలో భాగంగా అప్పుడే జన్మించిన బిడ్డకు ఆధార్‌ సీడింగ్‌ ఇచ్చే ప్రక్రియను ఏపీలో ప్రారంభిస్తున్నారు తొలి రోజు ఎంపిక చేసిన ఐదు మంది శిశువులకు ఆధార్‌ సీడింగ్‌ కేటాయించనున్నారు.