Showing posts with label Bank Holiday. Show all posts
Showing posts with label Bank Holiday. Show all posts

4 రోజులు పాటు బ్యాంకుకు సెలవులు



సాధారణంగా బ్యాంకులకు ఒకటి రెండు రోజులు సెలవులు వస్తేనే
సాధారణ ప్రజలు ఇబ్బందులు పడతారు. కానీ మార్చిలో వరుసగా నాలుగు రోజులు
సెలవులు వస్తున్నాయి. మార్చి 24 నుంచి 27 వరకు బ్యాంకులకు సెలవులు
కావడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలకు కాస్త విరామం రానుంది. ఈ నేపథ్యంలో
వినియోగదారులు ముందుగానే జాగ్రత్త పడి ఏటీఎంలపై వైపు పరుగులు తీసే
అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

వరుస సెలవుల కారణంగా జాగ్రత్తగా నగదు నిల్వకు బ్యాంకులు ప్లాన్ చేయకపోతే
వినియోగదారులకు సమస్యలు తప్పవని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దాదాపు అన్ని బ్యాంకులు ఏటీఎంలలో నగదు లోడింగ్‌ను ప్రైవేటీకరణ చేసిన
నేపథ్యంలో ఆయా బ్యాంక్ ఏటీఎంలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.

ఆ నాలుగు రోజులు సెలవులు ఇవే..
♦ మార్చి 24 గురువారం హోలీ
♦ మార్చి 25 శుక్రవారం గుడ్ ఫ్రైడే
♦ మార్చి 26 నాలుగో శనివారం, 27 ఆదివారం

ప్రస్తుతం నెలలో రెండు శనివారాలు బ్యాంకులకు సెలవు, మరో రెండు శనివారాలు
పూర్తి పని వేళలను అమలుచేస్తున్న సంగతి తెలిసిందే.

ATM లకు కూడా దసరా సెలవులు! పనుంటే ఈ రోజే ముగించుకోండి!!

Dasara Holidays For ATM

ATM లకు కూడా దసర సెలవులు ఇచ్చేశారు. ఈ నెల 21 నుండి అంటే రేపటి నుండి 25 వరకు బ్యాంకులన్నీ మూతపడుతున్నాయని ఇది వరకే తెలుసు. అయితే ఈ సెలవులు బ్యాంకులకు మాత్రమే కాదు.. ATM లకు కూడా వర్తిస్తాయి. అదెలా అంటే ATMలు వర్క్ చేయాలంటే వాటిని ఎప్పటికప్పుడు క్యాష్ తో నింపాలి. ఈ డ్యూటీని ప్రైవేట్ సిబ్బంది చేస్తారు. వారికి కూడా దసరా సెలవులు ఇచ్చేసారు. దీంతో ATM లలో ఈ రోజే మని పెడితే, మళ్ళీ ఆ ATMలో డబ్బును నింపేది 26 నే. సో డబ్బులున్నంత వరకే ATM లు పనిచేస్తాయి. తర్వాత నో క్యాష్ అంటూ వెక్కిరిస్తాయ్. సో పండగ కాబట్టి, డబ్బుల అవసరం గట్టిగానే ఉంటుంది కాబట్టి ముందుగానే ప్లాన్ వేసుకొని ఎంత కావాలో నిశ్చయించుకోని ఈ మేరకు డబ్బులు ఈ రోజే డ్రా చేసుకోండి. లేకపోతే పండగ పూట పక్కింటికి చేతి బదులు కు వెళ్ళాల్సొస్తుంది. చుట్టాల ముందు పరువు పోతోంది. ఇప్పటికే కొన్ని ATMలలో డబ్బులు ఇలా పెడితే అలా అయిపోతున్నాయ్.!!