డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులు

సినిమా పరిశ్రమలోని అవలక్షణాలు లోపాలు గతంలో పలుమార్లు బహిర్గతమైనా అవన్నీ మామూలేలే అనుకుంటూ జనం కూడా చూసి చూడకుండా ఉన్నారు. అయితే ఇప్పుడు వారిలోని విషసంస్కృతి మొత్తం సమాజాన్నే చెడుదారిపట్టించేలా మారడంతో ప్రభుత్వాలు కొరడా ఝళిపించాయి. తీగ లాగే కొద్దీ డొంక కదులుతోంది. రవితేజ, తనీష్, తరుణ్, నందు, చార్మీ, పూరీ జగన్నాథ్, ముమైత్ ఖాన్ తదితరులు పోలీసుల నుంచి నోటీసులు అందుకోగా మరికొందరు ఇందులో ఉన్నట్లు తెలిసింది. వారందరికీ ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి.

పక్కా సాక్ష్యాలున్న తర్వాతే రంగంలోకి దిగుతారు. కెల్విన్ కేసులోనూ ఎన్ ఫోర్స్ మెంట్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టంలోని సెక్షన్ 67ను ప్రయోగించాలని నిర్ణయించింది. దీని ప్రకారం.. ఓ వ్యక్తి పక్కాగా డ్రగ్స్ వాడుతున్నట్లు లేదా విక్రయిస్తున్నట్లు అనుమానం ఉంటే నివృత్తి చేసుకోవడానికి నోటీసులు ఇచ్చి పిలుస్తారు. విచారణలో చెప్పే అంశాలను, తమ వద్ద ఉన్న సమాచారాన్ని బేరీజు వేసుకొని పొంతన కుదురుతోందా? లేదా అన్నది పరిశీలిస్తారు. ఆ తర్వాతే అసలు సినిమా ఉంటుంది. పూరీ ఇప్పటికే పోలీసులతో టచ్ లో ఉంటూ పలువురి పేర్లు వెల్లడించేశాడంటూ పుకార్లు వచ్చాయి. అయితే తాను ఎవరితోనూ మాట్లాడలేదని, ఎవరి పేర్లూ చెప్పలేదని ఆయన వివరణ ఇచ్చారు. ఏది ఏమైనా తమ వాళ్లను కాపాడుకునేందుకు సినిమా పెద్దలు రాజకీయ నాయకుల సాయం కోరుతున్నారు.
డ్రగ్స్ దందాలో తొలి నిందితుడిగా.. కీలకమైన కెల్విన్ను గడిచిన రెండు రోజులుగా అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అతను ఇచ్చిన ఆధారాలు.. సాక్ష్యాలతో పాటు.. అధికారుల వద్ద ఉన్న సమాచారంతో పలు స్కూళ్ల యాజమాన్యాలకు.. టాలీవుడ్ పరిశ్రమకు చెందిన 12 మందికి నోటీసులు ఇప్పటికే జారీ చేసారు. సాధారణంగా ఓ కేసులో దొరికిన నిందితుడు ఏది చెబితే దానిని నమ్మేసి హడావుడి చేసే విధానం ఎన్ఫోర్స్ మెంట్, నార్కోటిక్స్ విభాగాల్లో ఉండదు. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉండి.. డ్రగ్స్ తీసుకుంటున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ప్రముఖులకు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఇప్పటికే నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు ఈ నెల 19 నుంచి సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఈ నెల 19న ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ , 20న హీరోయిన్ ఛార్మీ, 21న ప్రత్యేక గీతాల నటి మొమైత్ ఖాన్ , 22న నటుడు సుబ్బరాజు, 23న ప్రముఖ కెమెరామ్యాన్ శ్యాం కే నాయుడు సిట్ ఎదుట హాజరుకాబోతున్నారు. ఇక ప్రముఖ హీరో రవితేజ ఈ నెల 24న సిట్ ను ఫేస్ చేయబోతున్నాడు. 25న ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను, 26న హీరో నవదీప్ , 27న హీరో తరుణ్ , 28న యువ హీరోలు తనీష్ , నందులను సిట్ విచారించనుంది. పేరుమోసిన డ్రగ్స్ సరఫరాదారుడు కెల్విన్ కాల్ లిస్ట్ ఆధారంగా వీరికి తెలంగాణ ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీచేసారూ....ఈ కేసు ఎటు తిరుగుతుందో తెలియడానికి మరింత టైం పట్టేలా ఉంది. మరింత లోతుగా దర్యాప్తు సాగితే తప్ప అసలు నిందితులు, దోషులు, బాధితుల పేర్లు బయటకు వచ్చే అవకాశం లేదు.
ThanQ Visit Again.

Related Posts