అయితే తండ్రి వల్లే తన తల్లి చనిపోయిందని ఎలాగైన తండ్రిని అతడి కుటుంబాన్ని నాశనం చేయాలని జై అనుకుంటూ ఉంటాడు. అలానే చిన్నప్పుడే తండ్రి తనని వదిలి వెళ్లిపోవడంతో జై చెడు సావాశాలతో పెద్ద గ్యాంగ్ స్టర్ గా మారిపోతాడు మరోవైపున తండ్రితోనే ఉంటూ లవకుశ డ్రామా ఆర్టిస్టులుగా జీవిస్తుంటారు. ఇలా డ్రామాలు వేసే తమ్ముళ్లకి రౌడీయిజం చేసే అన్నయ్యకి మధ్య నడిచే ఓ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా జై లవకుశని తీర్చిదిద్దేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తుందని సమాచారం.
ఇక ఈ సినిమాలో యన్టీఆర్ త్రిపాత్రాభినయం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చిత్ర బృందం చెబుతోంది. అలానే పోసాని కృష్ణ మురళి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు దాదాపు సినిమా మొత్తం పోసాని పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలిసింది. మరి ఈ కథ అభిమానుల్ని అంచనాల్ని ఏ రీతిన చేరుకుంటుందో చూడాలి.
