ఆధార్‌ కార్డ్‌పై మనం ఎన్ని సిమ్ కార్డులు కొనవచ్చో తెలుసా !



భారత్‌లో టెలికాం రంగం ఏ స్థాయిలో విస్తరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కొక్కరి వద్ద రెండు మూడు ఫోన్‌లు కూడా ఉంటున్నాయి. ఇక ఆ ఫోన్‌లలో రెండు మూడు సిమ్‌లు ఉంటున్నాయి. అంటే ఒకే వ్యక్తి నాలుగు, అయిదు.. ఇలా లెక్క లేనన్ని సిమ్‌లు తీసుకుంటున్నాడు. అయితే కేంద్ర ప్రభుత్వం మరియు ట్రాయ్‌ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి 9 సిమ్‌లు ఇవ్వవచ్చు. తాజాగా ట్రాయ్‌ వెళ్లడి చేసిన నియమ నిబంధనల ప్రకారం ప్రతి సిమ్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాల్సి ఉంది.

ఒక ఆధార్‌ కార్డుపై 9 సిమ్‌లకు మించి ఇవ్వవద్దనేది ట్రాయ్‌ నిబంధన. అయితే ఈ నిబంధనను ఎన్ని టెలికాం ఆపరేటర్లు పాటిస్తున్నాయో అనేది మాత్రం అనుమానమే. కేవలం ఆధార్‌ కార్డు నెంబర్‌తో సిమ్‌లను విచ్చలవిడిగా జియో ఇచ్చేస్తుంది. ఒకే ఆధార్‌ కార్డు మీద లెక్కకు మించి సిమ్‌ కార్డులను జియోతో పాటు ఇతర టెలికాం సంస్థలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే ట్రాయ్‌ ప్రతి నెంబర్‌ను ఆధార్‌కు అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత ఒక్క ఆధార్‌పై ఉన్న ఎక్కువ నెంబర్‌లపై విచారణ చేసే అవకాశాలున్నాయి. దేశంలోని ఉగ్రవాదుల చేతుల్లోకి సిమ్‌ కార్డులు వెళ్లవద్దనే ఉద్దేశ్యంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ThanQ Visit Again.

Related Posts