పవన్‌ పుట్టిన రోజున కూతురు కోరిన కోరిక

Happy Birthday Power Star Pawan Kalyan


రేణుదేశాయ్‌తో పవన్‌ కళ్యాణ్‌ కొన్నాళ్ల క్రితం విడిపోయిన విషయం తెల్సిందే. విడిపోయే సమయంకు వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు ప్రస్తుతం రేణు దేశాయ్‌ వద్దే పెరుగుతున్నారు. పుణె వెళ్లిన ప్రతిసారి పవన్‌ ఆ పిల్లలను కలిసి, వారితో సరదాగా గడిపి వస్తూ ఉంటాడు. నేడు పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు అనే విషయం తెల్సిందే. ఈ సందర్బంగా పవన్‌ కూతురు ఆద్య తన తల్లి రేణు దేశాయ్‌ని ఒక కోరిక కోరిందట. ఆ విషయాన్ని రేణు దేశాయ్‌ ట్విట్టర్‌ ద్వారా వెళ్లడి చేసింది.
‘మమ్మీ ఈ రోజు నాన్న పుట్టిన రోజు కదా.. నీవు తప్పకుండా నీ ఫోన్‌లో నాన్న ఫొటో పెట్టుకోవాలి’ అని అడిగిందట. అందుకు చిన్న పాప మనస్సు నొప్పించడం ఎందుకు అని పవన్‌ ఫొటోను తన మొబైల్‌ స్క్రీన్‌పై పెట్టినట్లుగా రేణు దేశాయ్‌ చెప్పుకొచ్చింది. ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన భావాలను, తన సంతోషాలను, బాధలను పంచుకుంటు ఉండే రేణు దేశాయ్‌ పవన్‌ పుట్టిన రోజు సందర్బంగా ఈ ట్వీట్‌ చేసి అందరి హృదయాను కదిలించింది.

ThanQ Visit Again.

Related Posts