హ్యాపీ బర్త్ డే సీతయ్య Nandamuri Hari Krishna Birthday Special

Nandamuri Harikrishna Birthday Special



విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు కుమారుడు, నందమూరి బాలయ్యకు సోదరుడు, జూనియర్ NTR తండ్రి అయిన నందమూరి హరికృష్ణ సినీ నటుడుగా, రాజకీయ నాయకునిగా అందరికీ తెల్సు. హరికృష్ణ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని సంచలన విషయాలు తెలియజేస్తున్నాం. అవేమిటో చూద్దాం....
* సెప్టెంబర్ 2న జననం 
నందమూరి తారకరామారావు బసవతారకం దంపతులకు మూడవ కుమారునిగా హరికృష్ణ జన్మించాడు.
* బాలనటుడిగా
ఎన్ టి ఆర్ 1967లో నటించిన శ్రీకృష్ణావతారం చిత్రం''లో హరికృష్ణ బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసాడు. తల్లా పెళ్ళామా చిత్రం''లో కూడా బాలనటుడి పాత్ర పోషించాడు.
* నటుడిగా రంగప్రేవేశం 
ఇక 1974లో వచ్చిన తాతమ్మకల చిత్రం''లో నటుడిగా ఆరంగేట్రం చేసాడు. కొన్ని సినిమాల్లో నటించాడు.
* మోహన్ బాబుతో కల్సి
కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో కల్సి హరికృష్ణ 1998లో పరిటాల రవి తీసిన శ్రీరాములయ్య చిత్రం''లో సత్యం పాత్రతో అలరించాడు.
* NTR కి డ్రైవర్
NTR 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టి, చైతన్య రథంపై రాష్ట్రమంతా పర్యటించారు. ఆ చైతన్య రథానికి డ్రైవర్ హరికృష్ణే.

* మంత్రిగా - రాజ్యసభ సభ్యునిగా
తెలుగుదేశం పార్టీ లో NTR పై తిరుగుబాటు చేసినపుడు చంద్రబాబుకి వెన్నుదన్నుగా నిల్చిన హరికృష్ణ, అప్పట్లో రవాణా శాఖ మంత్రిగా పనిచేసాడు. హిందూపురం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. రాజ్యసభకు ప్రాతినిధ్యం వచించాడు. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా హరికృష్ణ రాజీనామా చేశాడు.
* ఈ ఇద్దరు హీరోలూ హరికృష్ణ తనయులు
హీరో కళ్యాణ్ రామ్, యంగ్ టైగర్ NTR ఇద్దరూ టాలీవుడ్ లో నటులుగా వున్నారు.
* నాగార్జున తో కల్సి 
ఇక 1999లో హీరో నాగార్జున తో కల్సి సీతారామరాజు చిత్రం''లో హరికృష్ణ నటించాడు.
* లాహిరి లాహిరిలో 
సుమన్ , వినీత్ , ఆదిత్య ఓం తదితరులతో కల్సి లాహిరి లాహిరి చిత్రం''లో హరికృష్ణ నటించాడు.
* జగపతి బాబుతో కల్సి
నటుడు జగపతి బాబుతో కల్సి శివరామరాజు సినిమాలో హరికృష్ణ నటించాడు.
* సీతయ్యలో హీరోగా 
వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వంలోనే వచ్చిన సీతయ్య సినిమాలో పోలీసు అధికారి పాత్రతో హీరోగా హరికృష్ణ నటించి మెప్పించాడు. ఈ మూవీలో హీరోయిన్ సిమ్రాన్.
* టైగర్ హరిచంద్రప్రసాద్ 
రైతు సమస్యలపై తీసిన టైగర్ హరిచంద్రప్రసాద్ మూవీలో హరికృష్ణ పవర్ ఫుల్ రోల్ పోషించాడు.
* స్వామి - శ్రావణ మాసం
స్వామి చిత్రం''లో చెల్లెళ్లను హతమార్చిన వాళ్లపై పగ తీర్చుకునే పాత్రలో హరికృష్ణ రాణించాడు. మీనా హీరోయిన్. అలాగే శ్రావణ మాసం మూవీలో సూపర్ స్టార్ కృష్ణ తదితరులతో కల్సి హరికృష్ణ నటించాడు.

ThanQ Visit Again.

Related Posts