Prakash Raj Mana Oori Ramayanam Movie
Mana Oori Ramayanam Movie Songs Download on MaTelugu.Com
ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించి.. నిర్మించి.. దర్శకత్వం వహించిన చిత్రం మన ఊరి రామాయణం. ఫస్ట్ టీజర్ తోనే అందరినీ ఈ మూవీ ఆకట్టుకోగా.. రెండో టీజర్ తో చిన్నపాటి షాక్ ఇచ్చాడు ప్రకాష్ రాజ్. ఈ రెండు చూసిన వాళ్లు.. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ చూస్తే.. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి చాలా టైమ్ పడుతుంది.
గొప్పదనం కోసం పాకులాడే వాడిగా మొదట ప్రకాష్ రాజ్ కనిపించగా.. రెండోసారి ప్రియమణిపై ఏదో అఘాయిత్యం చేసే టైపులో టీజర్ వదిలారు. ఇప్పుడు థియేట్రికల్ చూస్తే.. సినిమా అంతా ప్రియమణి చుట్టూ తిరుగుతుందనే విషయం తెలిసిపోతుంది. తన పెరట్లోనే ఈమెను పెట్టుకుని.. కనీసం ఇంటికెళ్లి పెళ్లాంపిల్లలను కూడా పలకరించలేని పరిస్థితి ప్రకాష్ రాజ్ పాత్రది. ఊరంతా ఈయన ఏమైపోయాడో అని అనకుంటూ ఉంటే.. ప్రియమణి మాత్రం ఆడేసుకుంటూ ఉంటుంది. మన ఊరి రామాయణం ట్రైలర్ ఎండ్ కార్డ్స్ లో ప్రకాష్ రాజ్ కంటే ప్రియమణి పేరు ముందు ఎందుకు ఉందో.. ఈ ట్రైలర్ చూశాక ఓ క్లారిటీ వచ్చేస్తుంది.
టీజర్ - ట్రైలర్లతోనే దర్శకుడు ప్రకాష్ రాజ్ ఇన్ని ట్విస్టులు ఇస్తే.. ఇక లీడ్ రోల్ లో ఈ సూపర్ యాక్టర్ చేయబోయే మాయలు ఎన్ని ఉంటాయో అనిపించక మానదు. మరి మన ఊరి రామాయణంలో ప్రకాష్ రాజ్ ఏమేం చూపించబోతున్నాడో తెలియాలంటే.. అక్టోబర్ 7 వరకూ ఆగాల్సిందే.
