హాలీవుడ్ స్థాయిలో విక్రమ్ ఇంకొక్కడు

Vikram - Nayanatara Inkokkadu Telugu Movie MP3 Songs Download on MaTelugu.Com



చియాన్ విక్రమ్. మన సౌత్ అమీర్ ఖాన్ అని ఊరికనే అనడంలేదు జనం. అతగాడి పర్ఫెక్షన్ మరియు డెడికేషన్ ముందు ఎవరైనా కూడా క్లీన్ బౌల్డ్ అవ్వాల్సిందే. అదే విక్రమ్ స్పెషాలిటీ. అందుకే అతగాడు చేసిన ''ఐ'' వంటి సినిమాలు కమర్షియల్ గా ఫ్లాపైనా కూడా.. సినీ ప్రియుల హృదయాలను ఎప్పుడూ అలరిస్తుంటాయి. 

ఇప్పుడు కొత్తగా ''ఇరుమగన్'' (తెలుగులో ఇంకొక్కడు) అనే సినిమాతో వస్తున్నాడు విక్రమ్. ఈ సినిమా ట్రైలర్ చూస్తే.. మనోడి టాలెంట్ ఏంటో ఇట్టే అర్దమైపోతుంది. ఒక ప్రక్కన బారీతీయ ఇంటెలిజెన్స్ (రా) ఆఫీసర్ గా.. మరో ప్రక్కన ఒక హిజ్రా విలన్ గా.. చించేశాడంతే. మలేషియాలో కెమికల్ సైంటిస్ట్ అయిన ఒక హిజ్రా డ్రగ్స్ సప్లయ్ చేస్తుంటాడు. అతగాడిని పట్టుకోవడానికి ఇండియా నుండి ఇద్దరు ఆఫీసర్లు వస్తారు.. ఒకరు విక్రమ్ మరొకరు నిత్యా మీనన్. అదే కథ. ఈ మధ్యలో నయనతార విక్రమ్ గాళ్ ఫ్రెండ్ గా కనిపిస్తుంది. ఆమె కూడా ఒక సీక్రెట్ ఏజెంటే. ఆనంద్ శంకర్ డైరక్షన్ లో రూపొందిన ఈ సినిమా విజువల్స్ అండ్ మ్యూజిక్ క్వాలిటీ హాలీవుడ్ రేంజులో ఉంది. హారీస్ జయరాజ్ మరోసారి హిట్టు మ్యూజిక్ కొట్టినట్లున్నాడే. 

ఇకపోతే నిత్యా మీనన్ పాత్ర చిన్నదే అనుకుంట కాని.. నయనతార మాత్రం అందాలతో ఊరిస్తోంది. మరి డబుల్ యాక్షన్లో విక్రమ్ ఈసారి ఏ మ్యాజిక్ చేస్తాడో చూడాల్సిందే. 


Vikram - Nayanatara Inkokkadu Telugu Movie MP3 Songs Download on MaTelugu.Com


ThanQ Visit Again.

Related Posts