మా టీవీకి మనమంతా రైట్స్



ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో హ్యూమన్ వాల్యూస్ ను తట్టి లేపే మూవీగా మనమంతాకు గుర్తింపు వచ్చింది. నాలుగు డిఫరెంట్ స్టోరీలను చూపిస్తూ.. చివరకు అన్నిటినీ ఒకే పాయింట్ దగ్గర ఒక చోటకు తెచ్చే కాన్సెప్ట్ అందరి హృదయాలను హత్తుకుంది. అయితే.. పబ్లిసిటీ లోపం- స్టార్ వాల్యూ లేకపోవడంతో కలెక్షన్స్ మాత్రం రావడం లేదు. 

కానీ శాటిలైట్ విషయంలో మాత్రం మనమంతా రికార్డు ధరకు అమ్ముడుపోయింది. తెలుగు(మాటీవీ) మలయాళం(ఏషియానెట్) వెర్షన్స్ కు గాను ఈ చిత్రానికి స్టార్ నెట్వర్క్ 6.8 కోట్ల రూపాయలకు శాటిలైట్ రైట్స్ అగ్రిమెంట్ చేసుకుంది. థియేటర్లలో సత్తా చాటలేకపోయినా.. శాటిలైట్ విషయంలో ఈ మూవీకి బాగానే గిట్టుబాటు అయ్యాయి. ఇలాంటి క్లాస్ టచ్ ఉండే సినిమాలకు ఏ క్లాస్ సెంటర్లు.. ఓవర్సీస్ లో చాలా డిమాండ్ ఉంటుంది. మనమంతా చిత్రానికి విచిత్రంగా ఈ ఏరియాస్ లో కూడా వసూళ్లు రావడం లేదు.

ప్రస్తుతం మనమంతాను ప్రమోట్ చేసేందుకు స్టార్ గ్రూప్ మరో 20 లక్షలు వెచ్చించేందుకు అంగీకరించిందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో మోహన్ లాల్.. గౌతమిలు ఉండడంతో.. తమిళ్ వెర్షన్ కు కనీసం కోటి రూపాయలు గిట్టుబాటు అవుతాయని అంచనా వేస్తున్నారు. 
ThanQ Visit Again.

Related Posts