సినిమాలకు సమంతా గుడ్ బై చేప్పెసినట్లేనా !




సమంత వేరే కమిట్మెంట్ల వల్ల నో అందో లేక అందరూ అనుకుంటున్నట్లుగా సినిమాలకు గుడ్ బై చెప్పేద్దామనుకుంటోందో కానీ.. కోలీవుడ్లో తెరకెక్కుతున్న ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు నుంచి తప్పుకుని ఆశ్చర్యపరిచింది . ఈ మధ్య ధనుష్ సినిమా ‘వడ చెన్నై’ నుంచి బయటికొచ్చేసి గత ఏడాది ఆ చిత్ర నిర్మాత తనకిచ్చిన అడ్వాన్స్ చెక్ తిరిగిచ్చేసింది సమంత. మరిప్పుడు సమంత కమిటైన మిగతా ప్రాజెక్టుల సంగతేంటని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సమంత చేతిలో ఉన్నది ఒకే ఒక సినిమా కావడం.. అది కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో కమిటైన సినిమా కావడం ఆసక్తి రేకెత్తించే విషయం.

‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నాగ్ ఓ సినిమా నిర్మించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాకు హీరోయిన్ గా అనుకున్నది సమంతనే. ఐతే ముందు చైతూ-సమంత మరోసారి జత కడుతున్నారని వార్తలొచ్చినపుడు అది పెద్ద విషయం లాగా అనిపించలేదు. కానీ ఈ మధ్యే వీళ్లిద్దరి ప్రేమాయణం సంగతి బయటికి రావడంతో ఈ కాంబినేషన్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఐతే ధనుష్ సినిమాకు నో చెప్పేసిన సమంత.. చైతూ సినిమాను కూడా కాదంటుందా..? నాగార్జున ఇచ్చిన అడ్వాన్స్ చెక్కును కూడా రిటర్న్ చేసేస్తుందా అన్నది ఇప్పుడందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న. పెళ్లి తర్వాత వేరే వాళ్లతో సినిమాలు వద్దనుకుంటే ఓకే కానీ.. మరీ చైతూకు కూడా నో చెప్పేస్తుందా అన్నదే డౌట్.

ThanQ Visit Again.

Related Posts