బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. దిల్లీలో జరిగిన ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ కార్యక్రమంలో బిగ్‌బీకి ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ వయసులో కూడా విభిన్న పాత్రలు చేయగలుగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఐదు తరాల నటీనటులతో నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమానికి అమితాబ్ ఆయన కుటుంబ సభ్యులు జయా బచ్చన్, శ్వేతా పండిట్, అభిషేక్ బచ్చన్‌లతో కలిసి హాజరయ్యారు.
Amitabh Bachchan was honoured for Lifetime Achievement Award
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. దిల్లీలో జరిగిన ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ కార్యక్రమంలో బిగ్‌బీకి ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ వయసులో కూడా విభిన్న పాత్రలు చేయగలుగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఐదు తరాల నటీనటులతో నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమానికి అమితాబ్ ఆయన కుటుంబ సభ్యులు జయా బచ్చన్, శ్వేతా పండిట్, అభిషేక్ బచ్చన్‌లతో కలిసి హాజరయ్యారు.
ThanQ Visit Again.