కంప్యూటర్, ఈమెయిల్స్, బ్యాంక్ అకౌంట్స్, ఫేస్‌బుక్, ట్విట్టర్.. ఇలా అన్నింటిలోనూ మనకు వ్యక్తిగత ఖాతాలుంటాయి. అందులోని సమాచారాన్ని భద్రంగా ఉంచేందుకు వాటికి పాస్‌వర్డ్ పెట్టుకోవడం సహజమే. అయితే సులువుగా గుర్తుంటుందనో ఏమో గానీ.. చాలా మంది సాధారణ పాస్‌వర్డ్‌లను పెట్టుకుంటారు. అలా 123456 అనే సంఖ్య చాలా మంది పాస్‌వర్డ్‌గా పెట్టుకోవడంతో 2015 సంవత్సరానికి చెత్త పాస్‌వర్డ్‌గా నిలిచింది. అయితే 2014లోనూ ఇదే సంఖ్య చెత్త పాస్‌వర్డ్‌గా ఎంపికవడం గమనార్హం. బలహీనమైన పాస్‌వర్డ్‌లపై అవగాహన కల్పించేందుకు డేటా సాఫ్ట్‌వేర్ అనే సంస్థ ఏటా వరస్ట్ పాస్‌వర్డ్ పేరుతో జాబితా విడుదల చేస్తుంది. ఇందులో భాగంగానే 25 పదాలతో 2015జాబితా విడుదల చేయగా.. 123456 మొదటి స్థానంలో నిలిచింది. అనే పదం ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. 2014లోనూ ఈ పదం ఇదే స్థానంలో నిలిచింది. 12345678, , 12345 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇలాంటి పాస్‌వర్డ్‌ల ద్వారా భద్రతా పరమైన సమస్యలు ఎదురవుతాయని..వేరే వ్యక్తులు సులువుగా వీటిని గుర్తించి.. వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకునే అవకాశముందని సంస్థ తెలిపింది. పాస్‌వర్డ్‌ల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని.. అనేక ఖాతాలు ఉన్నప్పుడు ఒక్కో వెబ్‌సైట్‌కు వేర్వేరు పాస్‌వర్డ్‌లు ఉపయోగించడం మంచిదని పేర్కొంది.
ఈ ఏడాది కూడా ఇదే చెత్త పాస్‌వర్డ్..!
ThanQ Visit Again.
