సోగ్గాడుగా మళ్ళి 2017 సంక్రాంతికి వస్తున్న నాగార్జున

పొంగల్ పోటీలో నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సర్ ప్రైజింగ్ సూపర్ హిట్ గా నిలిచింది. నాలుగు చిత్రాల పోటీలోనూ బంగార్రాజు కేరక్టర్ తో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు నాగ్. ఈ అక్కినేని హీరో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాడు సోగ్గాడే. అభిమానులు కూడా ఊహించనంత స్థాయిలో నాగ్ నుంచి సర్ ప్రైజింగ్ హిట్ ను కొట్టేశాడు నాగార్జున. 

నాగ్ కూడా బంగార్రాజు కేరక్టర్ ని బాగా ఎంజాయ్ చేస్తూ చేశాడు. అందుకే ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారని చెప్పాలి. ఈ కేరక్టర్ ని ఇక్కడితో వదిలేసే ఉద్దేశ్యం నాగార్జునకు లేదు. అందుకే ఈ పాత్రను కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. కొత్త డైరెక్టర్ అయినా కళ్యాణ్ కృష్ణ చిత్రీకరించిన విధానం నాగ్ కూడా బాగా నచ్చింది. అందుకే సోగ్గాడే చిన్ని నాయనకు సీక్వెల్ తీయాలని నిర్ణయించుకున్నాడు నాగార్జున. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ అయినట్లు సమాచారం. 

సోగ్గాడి సీక్వెల్ కి  బంగార్రాజు అనే టైటిల్ నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ మూవీని కూడా నాగార్జున స్వయంగా నిర్మించనున్నాడు. అన్నిటి కంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం కొడుతున్నాం అన్నట్లుగానే హిట్టు కొట్టి చూపించి నాగార్జున.. 2017 సంక్రాంతికి బంగార్రాజు రిలీజ్ చేయాలని నిర్ణయించడం విశేషం. 


Soggade Chinni Nayana Movie Satellite Rights Taken By Gemini TV
అసలు సిసలు హిట్టు ఎలా ఉంటుందో నాగార్జున నిరూపిస్తున్నాడు. ఆయన కథానాయకుడిగా నటించిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ఇప్పటికే బంపర్ హిట్టుని సొంతం చేసుకొంది.  సంక్రాంతికి విడుదలైన నాలుగు చిత్రాల్లో నెంబర్ వన్గా...  బాక్సాఫీసు విన్నర్ గా నిలిచింది. 

ఆ చిత్రానికి 13 రోజుల్లో 38 కోట్ల షేర్ దక్కినట్టు సమాచారం. 17 కోట్లలో పూర్తయిన ఆ చిత్రానికి 38కోట్లు రావడమంటే పెట్టిన డబ్బుకి రెండింతలు తిరిగొచ్చినట్టు లెక్క. భారీ కాంపిటీషన్ మధ్య విడుదలైన ఆ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టుకోవడమంటే సంచలనమే అని చెప్పాలి. ఆ లెక్కలు చూసి ట్రేడ్ జనాలు కూడా విస్తుపోతున్నారు. అయితే ఇప్పుడు శాటిలైట్ రైట్స్ రూపంలోనే సోగ్గాడు కుమ్మేశాడు. ఆ చిత్రాన్ని జెమినీ టీవీ సంస్థ 6.50కోట్లకి కొనుగోలు చేసిందని తెలిసింది. దీంతో లాభాల శాతం మరింతగా పెరిగినట్టైంది. నాగార్జున ఎప్పట్నుంచో నష్టపోయిన డబ్బులన్నింటినీ ఒక్క చిత్రంతోనే తిరిగి రాబట్టుకొన్నట్టైంది. ఇప్పుడు నాగార్జున ఫేస్ లో కళ ఉట్టిపడుతోంది. కాన్ఫిడెన్స్ పెరిగింది. అదే ఊపులో తన తనయులకీ విజయాలు దక్కేలా కథల్ని ఎంపిక చేయాలని చూస్తున్నాడాయన. ఇప్పటికీ సుకుమార్ లాంటి అగ్ర దర్శకుల్ని లైన్ లో పెట్టారని తెలుస్తోంది. 
ThanQ Visit Again.

Related Posts