ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు. ఆమె మాత్రం ఒక ఫొటో నా జీవితాన్ని మార్చేసింది అని అంటోంది. ఆ అమ్మాయే ఆర్తన బిను. రాజ్ తరుణ్ సినిమా ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’లో హీరోయిన్ గా నటిస్తున్న ఈ మలయాళ కుట్టి తానీ సినిమాకు పని చేయడం ఒక మిరాకిల్ అంటోంది. కొన్ని నెలల కిందట ఈ అమ్మాయి ఫేస్ బుక్ పేజీలో ఓ అందమైన ఫొటోను పోస్ట్ చేసిందట. ఆ ఫొటో చూసి నచ్చేసి దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి ఆమెను హీరోయిన్ గా చేస్తావా అని అడిగాడట.
ముందు సినిమాలంటే భయపడ్డా.. కథ విని రాజ్ తరుణ్ హీరో అని తెలుసుకుని సినిమా చేయడానికి ఒప్పుకుందంట ఆర్తన. రాజ్ తరుణ్ ఇప్పటికే మూడు వరుస హిట్లతో దూసుకెళ్తున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా హిట్టవుతుందన్న అంచనాలున్నాయి. రాజ్ తరుణ్ తో ఇంతకుముందు నటించిన ఇద్దరు హీరోయిన్లూ బిజీ అయ్యారు. మరి ఆర్తన విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. ట్రైలర్ చూస్తే ఏమో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’లో హిట్టు కళ తాండవిస్తోంది. మరి ఈ నెల 29న విడుదల కాబోతున్న ఈ సినిమా ఆర్తనకు ఎలాంటి కెరీర్ ఇస్తుందో చూద్దాం మరి.
