Varun Tej Loafer Movie Audio Launch Highlights

Loafer Movie Audio Launch Highlights

Loafer Movie Songs Download

01 – Nokkey Dochey
Singer(s) :Sri Sunil Kasyap ,Spruthi

02 – Nuvvedusthunte
Singer(s):Yazin Nizar

03 – Jiya Jile
Singer(s) :Yazin Nizar,Pranavi

04 – Suvvi Suvvalamma
Singer(s):Karunya

05 – Chutta Beedi
Singer(s):Rahul,Shravana Bhargavi

Prabhas Speech At Loafer Audio Launch

Prabhas-Speech-At-Loafer-Audio-Launch

''ఇండియాలో హీరోల క్యారెక్టరైజేషన్ రాసే దమ్మున్న ఏకైన డైరక్టర్ పూరి జగన్. రాజమౌళి స్వయంగా చెప్పాడు. నేను ఒక సీన్ ను వంద రోజులు తీయాలి. కాని పూరి కేవలం ఒకే ఒక్క డైలాగ్ తో మొత్తం హీరో క్యారెక్టర్ అంతా చెప్పేస్తాడు. దటీజ్ పూరి జగన్'' అంటూ పూరీని పొగిడేశాడు ప్రభాస్. కాని ఇలా చెబుతుంటే మెగా ఫ్యాన్స్ సైలెంట్ గా ఉంటారా?? లోఫర్ ఆడియో లాంచ్ లో ఇదో విస్తుపోయే సీన్.

మొన్నటివరకు పవర్ స్టార్ అనే అరుపు మెగా ఈవెంట్లలో వినిపించకుండా బాగానే మ్యానేజ్ చేశారు కాని.. ఈసారి మాత్రం కుదర్లేదు. అందరూ అరుస్తూనే ఉన్నారు. పవర్ స్టార్ అంటూనే ఉన్నారు. దానితో బాహుబలుడు విస్తుపోయాడు. షాక్ అయ్యాడు. వెంటనే ఏమన్నాడంటే.. ''ఐ లైక్ పవర్ స్టార్.. మాట్టొడొచ్చా??'' అని అడిగేశాడు ప్రభాస్. అప్పుడు కాని మెగా అభిమానులు శాంతించలేదు.

ఇకపోతే వరుణ్ తేజ్ కత్తిలాంటి డైరక్టర్ చేతిలో పడ్డాడని.. ఖచ్చితంగా కమర్షియల్ గా పెద్ద స్టార్ అవుతాడని చెప్పుకొచ్చాడు డాళ్లింగ్.

Puri Jagannath Praises Prabhas in Loafer Audio launch

ప్రభాస్ ని హగ్ చేసుకుంటే బావుంటుంది.. నేను చాలా మంది హీరోయిన్స్ ని కూడా కౌగిలించుకున్నా కానీ.. ప్రభాస్ హగ్ మాత్రం చాలా బావుంటుంది. అందులో అంతటి ఆత్మీయత ఉంటుంది. ఇదీ లోఫర్ ఆడియో ఫంక్షన్ లో ప్రభాస్ పై పూరీ జగన్నాధ్ చేసిన కామెంట్స్.

తన సినిమాని తను పొగుడుకోవడం సాధారణంగా జరిగేదే. బాగా తీసేశాను సూపర్ గా వచ్చింది లాంటివి చెప్పుకోవడం సాధారణమే. కానీ లోఫర్ ఆడియో ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ప్రభాస్ ని ప్రశంసించడానికి తన సినిమాలోని డైలాగ్ నే లీడ్ గా తీసుకున్నాడు పూరీ. "టిప్పర్ లారీ వచ్చి సైకిల్ ని గుద్దేస్తే ఎలా ఉంటుందో తెలుసా" అంటూ బుజ్జిగాడులో ప్రభాస్ ఓ డైలాగ్ చెబ్తాడు.. ఇప్పుడు మా రెబెల్ స్టార్ మమ్మల్ని బాహుబలితో అలా గుద్దేశాడు అంటూ.. చరిత్ర సృష్టించిన ఆ సినిమాని నేరుగానే ప్రశంసించాడు. అంతే కాదు మాకు ఆ టిప్పర్ లారీ చాలా ఇష్టం అని కూడా చెప్పాడు.

కొన్నేళ్ల క్రితం అమ్మా నాన్నా తమళమ్మాయి తీసినపుడు.. తన గురువు వర్మ వచ్చి మామ్మ తాతయ్య మామయ్య అంటూ కథలు ఎలా రాస్తారని విమర్శించినట్లు చెప్పాడు పూరీ జగన్నాధ్. ఇప్పుడు లోఫర్ కి మాత్రం మా అమ్మ మహాలక్ష్మి అనే టైటిల్ పెట్టమని సూచించినట్లు లోఫర్ గురించి చెప్పుకొచ్చాడు పూరీ.

Nagababu At Loafer Movie Audio Launch

మెగా ప్రిన్స్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటించిన లోఫర్ ఆడియో ఫంక్షన్ అందరినీ అలరించింది. బాహుబలి ప్రభాస్ చీఫ్ గెస్ట్ రామ్ గోపాల్ వర్మ సహా అనేకమంది స్టేజ్ తమ మాటలు చెప్పి అలరించారు. కానీ.. ఓ విషయం మాత్రం అందిరినీ ఆశ్చర్యపరిచింది. అదే వరుణ్ తేజ్ తండ్రి నాగేంద్ర బాబు ఫంక్షన్ కి వచ్చినా.. స్టేజ్ మీదకు మాత్రం రాకపోవడం.

లోఫర్ ఆడియో వేడుకకు మెగా హీరోలు ఎవరూ రావద్దని పూరీ కండిషన్ పెట్టాడనే టాక్ ముందునుంచి వినిపించింది. అందుకు తగ్గట్లుగానే ఏ ఒక్క మెగా హీరో కూడా ఇందులో కనిపించలేదు. చివరకు మెగాస్టార్ మాత్రం ఓ సౌండ్ బైట్ ఇచ్చారంతే. ఇలా మెగాహీరోలు కనిపించని మెగా వారసుడు ఫంక్షన్ ఇదే అని చెప్పాలి. అయితే.. ఫంక్షన్ కు వచ్చి. స్టేజ్ కింద ఉన్న నాగేంద్రబాబు ఒకసారి కూడా స్టేజ్ ఎక్కకపోవడం ఆశ్చర్యకరమే అని చెప్పాలి.

ఓ రకంగా చెప్పాలంటే.. అన్నయ్య చిరంజీవికి అపర భక్తుడు నాగబాబు. తన వాళ్లు ఎవ్వరూ రాలేదు కాబట్టి.. తను కూడా స్టేజ్ ఎక్కలేదు.. వాటే మెగా యూనిటీ అనుకున్నారు చాలామంది. అయితే.. ఓ విషయంలో మాత్రం నాగబాబు స్టేజ్ ఎక్కని లోటు కనిపించింది. ఆడియన్స్ నుంచి పవర్ స్టార్ అని వచ్చే అరుపులను నాగబాబు గత ఫంక్షన్లలో కంట్రోల్ చేశారు. ఈ సారి మాత్రం వీటిని కంట్రోల్ చేయడం ఎవరి వల్లా కాలేదు.

Loafer Movie Trailer Talk

'లోఫర్' సినిమా ఆడియో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా మరో కొత్త ధియేట్రికల్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. పదండి ఎలా ఉందో చూద్దాం.

లోఫర్ సినిమాను ఆద్యంతం ఒక మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా పూరి జగన్ రూపొందించాడని ట్రైలర్ ను చూస్తుంటే అర్దమైపోతోంది. వరుణ్ తేజ్ ఫుల్ మాస్ అవతార్ లో అదిరిపోయాడు. తొలిసారి ఇలా కనిపిస్తున్నాడేమో.. చాలా కిక్కిస్తున్నాడు. ఇక దిషా పాట్నీ ఏమీ తక్కవుది కాదు. ఆమె కూడా హాటు హాటుగా ఉంది. డ్యాన్సుల్లో ఇరగతీసేసింది. అయితే ఈ ట్రైలర్కు అసలు ఎట్రాక్షన్ మాత్రం తల్లి క్యారెక్టర్ చేసిన రేవతి.. తండ్రి క్యారెక్టర్ చేసిన పోసాని కృష్ణమురళి. ఆమె సెంటిమెంటుతో అదరగొడితే.. పోసాని కామెడీతో ఇరగదీశాడు. చూస్తుంటే ఇది మరో అమ్మానాన్న ఓ తమిళమ్మాయ్ సినిమా తరహాలో ఉంటుందేమో.

ఇకపోతే పిజి విందా సినిమాటోగ్రాఫీ.. సునీల్ కాశ్యప్ మ్యూజిక్.. రెండూ బాగున్నాయ్. ఓవరాల్గా సి.కళ్యాన్ భారీగానే ఖర్చుపెట్టి ఈ సినిమాను అద్భుతంగా రూపొందించనట్టే కనిపిస్తోంది. మరి మాస్ తో దంచేసిన లోఫర్ డిసెంబర్ 17/18న వస్తున్నాడట. అప్పటివరకు వెయిట్ చేయండి.
ThanQ Visit Again.

Related Posts