శ్లోకం : ద్వాదిమౌ పురుషా లోకేక్షరాస్చాక్షర ఏవచ
క్షర స్సర్పాని భూతాని కూతస్తోక్షర వుచ్చతే.
దీని భావమేమిటంటే ... లోకంలో ఇద్దరు పురుషులున్నారు . వారే క్షరాక్షరులు . క్షరుడు సర్వదేవ శరీరంలందుంటాడు . అక్షరుడు-క్షరుడేక్కడుంటారో అక్కడ వానితో కూడుకుని వుంటాడు. ఇక మూడవ వాడు పరమాత్మ. పరమాత్మ అనగా ఆత్మ కంటే పరముగా (వేరుగా) వున్నది. మిగతా ఇద్దరు పురుషులకంటే వేరుగా ఉత్తమముగా ఉన్నదే పరమాత్మ.
లింగం మీద వున్న మూడు రేఖలు ఈ ముగ్గురు పురుషుల గురించి చెబుతున్నాయి. జీవాత్మ-పరమాత్మను చేరునపుడు జన్మలు లేకుండా పోయి జీవభావము నశించి దైవ భావము ఏర్పడును. అనగా జీవాత్మ అణువణువునా వ్యాపించి వున్నా పరమాత్మలో చేరి తను కూడా శూన్యుడయిపోవును. ఈ విధముగా జీవాత్మ పరమాత్మను చేరవలయునంటే రెండవదయిన ఆత్మను తెలుసుకునవలయును. ఆత్మను తెలుసుకుని ఆత్మ జ్ఞాని శక్తీ చేత జన్మలకు కారణమయిన కర్మలన్నింటిని నిర్మూలన చేసుకున్న తర్వాతనే జీవాత్మ పరమాత్మను చేరగలదు . జీవాత్మ శరీరంతో వున్నపుడు ఆత్మను తెలుసుకొనిన శరీరం వదిలిన తర్వాత పరమాత్మ ను సందర్సించగలరు. అందువలన శరీరం తో ఎవరు కూడా పరమాత్మను తెలియలేరు. పరమాత్మ శరీరం లేని వారికే తెలియును. ఏ జీవుడయిన జీవితంలో ఆత్మనే తెలుసుకుని ధ్యానించవలయును. పరమాత్మను ద్యానించలేరు. అందువల్లనే లింగం మీద మూడు రేఖలుగా గుర్తించిన వాటిలో మధ్యనున్న రేఖకు చందన, కుంకుమ గుర్తింపునిచ్చారు . ఆత్మలు స్వచ్చమైనవని తెలియచెప్పుటకు తెల్లని రంగులో రేఖలు గుర్తించారు. మనం లింగాన్ని పూజిస్తాం. కాని పానిపట్టుని కాదు దని అర్దమేమిటంటే ప్రకృతి కంటే పురుషుడే ముక్యమని. ఇంతకి దేవుడు ఎవరు ? ఇది తెలుసుకునే ముందు దేవుడు అన్న పదానికి అర్ధం ఏమిటి ?
రేపు చుడండి ...