దేముడు ఎవరు ? part 3

స్త్రీ –పురుషుల కలయిక వల్లనే ఈ సృష్టిలో ప్రతీ జీవి వుద్బవిస్తున్నది. ప్రకృతి- స్త్రీ అయితే పరమాత్మ-పురుషుడు. ప్రకృతి-పురుషుల కలయికే జీవుల ఆవిర్బవానికి కారణం. మనం శివ కోవెలలో చుస్తే శివలింగం వుంటుంది. అదెక్కడ వుంటుంది ? పానిమట్టం లో వుంటుంది. అది కూడా ? పానిమట్టం మద్య భాగములో వుంటుంది. లింగం కొంత భాగం ? పానిమట్టం లోపల కొంత భాగం ? పానిమట్టం బయట వుంటుంది. అలా ఎందుకుంటుంది ? ఇది తెలుసుకోవాలంటే భగవద్గేతలో గుణత్రయ విభాగంలో 3 మరియు 4 వ శ్లోకాలు చదవాలి.
3 వ శ్లోకం : మామ యోనిర్మహాద్ర్హ్బహ్మ తస్లిన్ గర్భందధామ్యహం
సమ్చన సర్వ భూతానాం తలో భవతి భారతా ?
4 వ శ్లోకం : సర్వయోలఘకాంతేయ ! మూర్తయ : సంచా వన్తియే :
తాసాం బ్రహ్మ మహోద్యోని రకం బీజ ప్రద:పితా

Lingam

భావం: ప్రకృతి అంతయూ నాకు స్త్రీ గా వున్నది . దానికి నేను బీజదాతగా వున్నాను. అందుకు సమస్త జీవరాసులు మాకు పుట్టుచున్నవి. ఏ గర్భం నుండి ఏ జీవరాసి అయిన అనగా సమస్త జీవరాసులకు మాత ప్రకృతి. భీజదాత నైన నేను తండ్రిని.

పై శ్లోకం బట్టి మనకు అర్దమవ్తున్నదేమిటి ? ఈ సృస్తి అంతా ప్రకృతి , పురుషుల కలయిక వల్లనే ఏర్పడింది. అంటే స్త్రీ-పురుషుల కలయిక అన్నమాట. ఇక్కడ ప్రకృతి స్త్రీ యని పురుషుడు పరమాత్ముడని అర్ధం. ఇప్పుడు శివలింగం దగ్గరకు వద్దాం . లింగం పురుషాంగాకారములో వుంటుంది. ప్రకృతిని స్త్రీ గా గుర్తించునట్లు స్త్రీ యోని ఆకారముగా పానిమట్టం ను మరిచారు. స్త్రీ అంగాకరమైన పానిమట్టం లో పురుష అంగాకరమైన ప్రతిస్టించిబడి వుంటుంది. దీని అర్ధం ప్రకృతి పురుషులు కలసి వున్నారని అర్ధం. పానిమట్టం మద్యలో లింగం వుండడం ప్రకృతికి పరమాత్మ ఇరుసుగా వున్నదని తెలియుచున్నది.

lord-shiva-hd-wallpaper-free-download14

పానిమట్టం పైన లింగం వుండటం ప్రక్రుతినదిస్టించి పరమాత్మ వున్నారని అర్ధం. పానిమట్టం లోపల, బయట లింగం వుండడం అంటే పరమాత్మ ప్రకృతి లోపల ప్రకృతి బయట వున్నాడని అర్ధం. ఇందులో శృంగార రసమేమి లేదు. సకల జీవరాసులు ప్రకృతి పరమాత్మవల్లనే జనియిస్తున్నాయని చెప్పడం కోసం ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. సమస్త జీవరాసులు పరమాత్మ చైతన్యము చేత ప్రకృతి నుండి ఒక ఆకారములో పుట్టుచున్నవని తెలుసుకోనుట కోరకు ఒక పాత్రలో నీరు పోసి ఒక్కొక్క చుక్క లింగం మీద పడునట్లు చేసారు. లింగం మీద పడిన నీటి బిందువు లింగం నుండి జారి ప్రకృతిగా పోల్చిన పానిమట్టం చేరి అక్కడ నుండి ఒక మార్గం ద్వారా బయటపడుచున్నది. ఈ విదంగా ప్రతి నీటి బిందువు జారిపోతుంటుంది ప్రతి జీవరాసి ప్రకృతి పురుషుల వలననే జన్మించింది అనుటకు రుజువుగా లింగ ప్రతిష్ట మీద ధారాపాత్రను ఉంచారు. నీటి బిందువులను జీవులుగా పోల్చి పరమాత్మ ప్రకృతివలననే వుద్భావిన్చుచున్నవనునటుల నీటిబిందువులు లింగం నుండి జారి పాణి మట్టము నుండి బయటకు పోవునట్లు చేసారు. ఎడ తెరిపిలేకుండా లింగం మీద నీటి బిందువులు పడునట్లు చేయడం వలన ఎడతెరిపి లేకుండా జీవులు పుట్టుచున్నవని తెలియుచున్నది. లింగం నుండి నీరు పానిమట్టం మీదుగా పోవడమే సృష్టి అంతరార్ధముగా తెలియబడుచున్నది.
ఇంతకి “ పరమాత్మ “అంటే అర్ధం ఏమిటి ? రేపు చూడండి.
ThanQ Visit Again.

Related Posts