Devi Sri Prasad's Father, Famous Writer Satyamurthy Passes Away

ప్రముఖ సినీ రచయిత సత్యమూర్తి కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజామున చెన్నైలోని ఆయన నివాసంలో గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో.. ఆయన్ను హాస్పిటల్ కు తరలించే ప్రయత్నం చేసినా.. ఈలోపే ఆయన తరలిరాని లోకాలకు వెళ్ళిపోవడం శోచనీయం. ఈ మధ్యకాలంలో సత్యమూర్తి యువ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ తండ్రిగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

ఆయన సుమారు 90కి పైగా సినిమాలకు రచయితగా పనిచేశారు. దేవత - చంటి - చాలెంజ్ - భలేదొంగ వంటి విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఇకపోతే సత్యమూర్తి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం చెన్నైలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ThanQ Visit Again.

Related Posts