Mark Zuckerberg Promises to Donate 99% of His Facebook Shares to Charity

వాషింగ్టన్: ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్, ఆయన భార్య ప్రిస్కిల్లా సంయుక్తంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫేస్ బుక్ లోని 99 శాతం షేర్లను స్వచ్చంద సంస్థలకు దానం చేస్తున్నట్లు ప్రకటించారు. మార్క్ జుకర్ బర్గ్, ప్రిస్కిల్లా దంపతులకు ఇటివల మాక్స్ అనే పాప జన్మించిన విషయం తెలిసిందే. పాప పుట్టిన సందర్బంగా వీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సందర్బంలో తమ కుమార్తెకు జుకర్ బర్గ్ దంపతులు బహిరంగ లేఖ వ్రాశారు. ఆ లేఖను జుకర్ బర్గ్ తన పేస్ బుక్ లో పోస్టు చేశారు. జుకర్ బర్గ్ ప్రస్తుతం స్వచ్చంద సంస్థలకు ఇస్తానన్న షేర్ల విలువ 45 బిలియన్ డాలర్లు. అంటే భారత్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 3,00,000 కోట్లు.

zuck-baby

ఇంత భారీ మొత్తంలో విరాళం ఇచ్చి అందరిని ఆయన షాక్ కు గురి చేశారు. జుకర్ బర్గ్ తీసుకున్న నిర్ణయాన్ని బిలిగేట్స్, ఆయన భార్య మెలిండా అభినందిచారు. జుకర్ బర్గ్ ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయం తమతో పాటు ప్రపంచానికి స్ఫూర్థిదాయకమని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. జుకర్ బర్గ్ తన కుమార్తెకు వ్రాసిన లేఖలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. కేవలం నీవు పుట్టావనే సంతోషంలో ఈ నిర్ణయం తీసుకోలేదు. మా కంటే గొప్ప జీవితం నీకు ఇవ్వాలని అనుకుంటున్నాం. నీతో పాటు అందరు చిన్నారులు సంతోషంగా ఉండాలనే ఆశతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశాడు. మేము మా బిడ్డతో సెటిల్ అయిన తరువాత కొత్త విషయాలు వెల్లడిస్తానని, ఇప్పుడు తాము చాల సంతోషంగా ఉన్నామని జుకర్ బర్గ్ వివరించారు.
ThanQ Visit Again.

Related Posts