By the release day itself this movie is Creating Huge Records this is the First Telugu Movie which is releasing in Tamil, Malayalam, Kannada, Hindi and Some other Foreign languages at the same time in a number of Screes Worldwide and after the movie release this movie has crossed the Collection of all King Khans in Bollywood. Bahubali Stood alone Hight Movie Grosser in India till now and Crossed Amir Khan P.K movie Collections. After Creating a huge Record in Collections, this movie created a record in TRP Rating. Now, an Official news is Out that Bahubali movie will be Uploaded in Youtube in Telugu, Tamil and Malayalam. Just wait for Tomorrow and Check what records will be Created by Bahubali movie in YouTube.
#BaahubaliOnYouTube
Baahubali cost for Watch on YouTube 150 Rupees or 2.5 Dollars
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం ఇప్పుడు ఆన్ లైన్ లోకి వచ్చేసింది. బాహుబలిని హై రిజొల్యూషన్ 4కే వెర్షన్ యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. కాకపోతే దీన్ని చూడ్డానికి కొంత ఖర్చవుతుంది. అంతే కాదు పైరసీని అడ్డుకునేందుకు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు.
"బాహుబలి ది బిగినింగ్" తెలుగు తమిళ్ మళయాళ వెర్షన్లను.. యూట్యూబ్ లో పెయిడ్ వీడియోగా అందుబాటులోకి తెచ్చారు. ఎవరైనా సరే 150 ఇచ్చి ఈ చిత్రాన్ని చూడచ్చు. అదే ఫారిన్ కరెన్సీలో రెండున్నర డాలర్లు చెల్లించాలి. పేమెంట్ చేశాక 30 రోజుల్లో చూడాల్సి ఉంటుంది. కానీ ఒకసారి చూడడం మొదలుపెట్టాక 48 గంటల్లో చూసేయాలన్నది నిబంధన. ఆ తర్వాత వారికిచ్చిన కోడ్ ఎక్స్ పైర్ అయిపోతుంది. అలాగే యూట్యూబ్ లో ఉన్నంత మాత్రాన.. బాహుబలిని డౌన్ లోడ్ చేసేసుకోవచ్చు అనుకుంటే పొరపాటే. ఇది కేవలం చూడ్డానికి మాత్రమే పరిమితం. అది కూడా యూట్యూబ్ లో మాత్రమే చూడాలి. వేరే చోట షేర్ చేసి చూసే అవకాశం లేదు.
అంతే కాదు.. దీన్ని కాపీ చేసేందుకు డౌన్ లోడ్ చేసుకునేందుకు అప్ లోడ్ చేసేందుకు ఆస్కారం లేదు. మొత్తానికి బాహుబలి కోసం బాగానే జాగ్రత్తలు తీసుకున్నారు. చూద్దాం.. పైరసీదారులు ఎలాంటి టెక్నిక్స్ కనిపెడతారో.