The Theory of Dark Energy | Description 2

డార్క్ ఎనర్జీ సిద్దాంతం :

నేను ఇప్పుడు మూడు సన్నివేశాలను చెబుతాను . ఆ మూడు సన్నివేశాలు ఒకేలాగ ఉంటాయి. అయితే వాటి ఫలితాలు, మీ ఫీలింగ్స్ వేరేగా ఉంటాయి.

Dark Energy Siddantham

ఫోటో రైటప్ : డార్క్ ఎనర్జీ సిద్ధాంతాన్ని వివరిస్తున్న మాన్యాల శ్రీనివాసరావు, పిజిక్ష్ హెచ్.ఒ.డి.
శ్రీ సన్యాసిరాజుగారు మరియు స్టేట్ బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు శ్రీ కె.వి.ఎన్. తమ్మన్నశెట్టిగార్లను ఈ ఫోటోలో చూడవచ్చు.


నెం. 1 :

: అర్దరాత్రి తలుపు చప్పుడైంది. మీరు నిద్రలేచి వెళ్లి తలుపు తీసారు. ఎదురుగా ఓ అందమైన అమ్మాయి. తనతో రమ్మని పిలుస్తోంది. మీరు ఆమెతో వెళ్తారా ? వెళ్ళరా ?

నెం. 2 :

: అర్దరాత్రి తలుపు చప్పుడైంది. వెళ్లి తలుపు తీసారు. ఎదురుగా మృత్యుదేవత. నాతో రావా? అని అడిగింది. అంతటి మృత్యు దేవత నన్ను రమ్మని పిలుస్తుంటే రిక్తహస్తాలతో తిరిగి పంపించ లేక సరే పదా? అన్నాను అంటాడు రవీంద్రుడు. అలా మనం అనగలమా ?

నెం. 3 :

: అర్దరాత్రి నేను పడుకున్న గదంతా వేడిగా అయిపోయింది. నీ ఒళ్ళు కాలిపోతుంది. రక్తం ఆవిరైపోతున్నట్టుంది. ఒక్కసారి కళ్ళు తెరిచాను. చీకటిగా ఉండవలిసిన నా గది పట్టపగలు లాగా వెళ్తురుతో నిండిపోయి వుంది. 7800 మైళ్ళు వ్యాసం గల భూమికి చాలా దగ్గరగా సూర్యుడు వచ్చేసాడు. సెకేనుకు 12 మైళ్ల వేగంకి అబిజిత్ నక్షత్రం వేల్లవలిసిన సూర్యుడు భూమివైపు వచ్చేస్తున్నారు. భూదేవి తలుపు తడుతున్నారు. తలుపు తీద్దామా! మనం తలుపులు తీసిన తీయకపొయినా సూర్యుడు మన దగ్గరకు వచ్చేస్తే ?
మనుషులు నిలివుగా తగలబడిపోతారు. ఎందుకంటే సూర్యుని ఉపరితలంపై 6000 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటే లోతుగా వెళ్తున్న కొలది దాని గర్బంలో 2 కోట్ల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతతో ఉంటుంది. ఎండాకాలంలో ఉష్ణోగ్రత 50" సెంటిగ్రేడ్ కు వెళ్ళేసరికే వడదెబ్బతో పిట్టలు రాలిపోవునట్లు జనం రాలిపోవుతున్నారు. అదే 6000 సెంటిగ్రేడ్ లు ఐతే ? అదే 2 కోట్ల సెంటిగ్రేడ్ అయితే ???
ఆకాశంలో ఎగురుతున్న కాకులు కాలిపోతు ఎగురుకుంటూ నేలరాలిపోతాయి. చెట్లు కాలిపోతాయి. అడవులు అగ్నిగుండంగా మారిపోతాయి. సముద్రాలలో నీరు ఆవిరై నీరంతా ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. సముద్రాలు ఎడారులుగా మారిపోతాయి.

( మిగతా విశేషాలు రేపు చూడవచ్చు )
ThanQ Visit Again.

Related Posts