Scientists hope will lead to Food supplied in space

అంతరిక్షంలో ఆహారపంటలు ?

food supplied in space

అంతరిక్షంలో ఆహార పంటలు పండించటం సాధ్యమేనని ఆస్ట్రేలియా శాస్త్రవేత పీటర్‌ వాటర్‌ హౌస్‌ తెలిపారు. క్వీన్స్‌ల్యాండ్‌ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన పీటర్‌ నికోటి యానా బెంతమైనా అనే పొగాకు మొక్కపై పరిశోధన జరిపి దాంట్లో ఉన్న ఒక ప్రత్యేకమైన జన్యువును గుర్తించారు. ఈ మొక్కను స్థానిక ఆదివాసీ ప్రజలు పిట్జురి అనే పేరుతో పిలుస్తారు. పిట్జురిని జన్యుశాస్త్రవేత్తలు దశాబ్దాలుగా వైరస్‌లు, టీకామందుల ప్రయోగాల్లో భాగంగా ఒక నమూనా మొక్కలాగా ఉపయోగిస్తున్నారు. పిట్జురి చరిత్రను తెలుసుకోవటానికి పీటర్‌ మొక్క జన్యుక్రమాన్ని విశ్లేషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1939లో ఆస్ట్రేలియా శాస్త్రవేత్త పిట్జురి విత్తనాలను తనకు తెలిసిన అమెరికా శాస్త్రవేత్తకు పంపించారని, అక్కడి నుంచి ఆది ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందన్నారు. 7.5 లక్షల ఏళ్లుగా ఈ మొక్క ఉనికిలో ఉందని తెలిపారు. ఎటువంటి కరవు పరిస్థితులనైనా తట్టుకొని విస్తరించే సామర్థ్యం ఉండటం వల్లే ఇంత సుదీర్ఘకాలం పాటు పిట్జురి ఉనికిలో ఉందని తెలిపారు. పిట్జురి వంటి మొక్కలపై మరింత పరిశోధన జరిపి అంతరిక్షంలో ఆహార పంటలను పండించటానికి దారి వేయవచ్చన్నారు.
ThanQ Visit Again.

Related Posts