ప్రపంచంలో రెండో అతిపెద్ద డైమండ్ దొరికింది

దక్షిణాఫ్రికాలోని బోట్సువానాలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జెమ్ క్యాలిటీ వజ్రాన్ని కనుగొన్నట్లు కెనడాకు చెందిన లుకారా డైమండ్ కార్పొరేషన్ ప్రకటించింది. శతాబ్ధ కాలంలో ఇంత పెద్ద వజ్రం బయటపడడం ఇదే తొలిసారని తెలిపింది. దీని సైజు క్యారెట్లు 1,111. దీంతో పాటు మరో రెండు వజ్రాలను కూడా ఇదే గని నుంచి వెలికితీసినట్లు కంపెనీ తెలిపింది. వీటి పరిమాణాలు 813, 372 క్యా రెట్లు. ప్రపంచంలో అతిపెద్ద డైమండ్గా కలినన్ డైమండ్ చరిత్రకెక్కింది. కలినన్ సైజు కారెట్లు 3,106. ప్రస్తుతం కలినన్ డైమండ్ బ్రిటన్ రాజవంశ ఖజానాలో ఉంది. దీన్ని లో దక్షిణాఫ్రికాలో కనుగొన్నారు 1905. ఈ వజ్రాన్ని ముక్కలుగా చేసి బ్రిటన్ రాజు కిరీటంలో అమర్చారు. బోట్సువానా ప్రపంచంలో అతిపెద్ద వజ్రాల ఉత్పత్తిదారు.
ThanQ Visit Again.

Related Posts