22 ఏళ్లకే కోటి రూపాయల జీతం ఢిల్లీ విద్యార్థికి గూగుల్ బంపర్ ఆఫర్
ఢిల్లీ టెక్నికల్ యూనివర్శిటీ (డిటియు) లో చదువుతున్న చేతన్ కక్కర్కు గూగుల్ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చింది. వేలు కాదు లక్షలు కాదు ఏకంగా కోటిపైనే. ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల విద్యార్ధి చేతన్ కక్కర్ అందుకోనున్న వార్షిక వేతనం 1.27 కోట్ల రూపాయలు. కోర్సు పూర్తయ్యక చేతన్ కాలిఫోర్నియాలోని గూగుల్ కార్యాలయంలో ఉద్యోగంలో చేరనున్నారు. చేతన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. ఇంత పెద్ద మొత్తంలో ఆఫర్ రావడం ఢిల్లీ యూనివర్శిటీకి రికార్డే. ఈ సంస్థకు గతంలో అత్యధిక వార్షిక వేతనం రికార్డు రూ. 93 లక్షల ఆఫర్ వచ్చింది. చేతన్ తల్లిదండ్రులు ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపకులుగా ఉన్నారు. గూగుల్ ప్రధాన కార్యలయంలో పనిచేసే అవకాశం దక్కడంపై చేనత్ ఆనందాన్ని వ్యక్తం చేశారు
ThanQ Visit Again.