చంపార చంపేయార అంటున్న రామ్ గోపాల్ వర్మ !

Ram Gopal Varma Vangaveeti Songs Download



రామ్ గోపాల్ వర్మను మల్టీ ట్యాలెంటెడ్ అనడంలో సందేహాలు అక్కర్లేదు. వివాదాలను సినిమాలుగా తీయడంలోనే కాదు.. వివాదస్పద కామెంట్స్ లోనూ ఈ దర్శకుడు ఎప్పుడో ఆరితేరిపోయాడు. ఇలాంటివన్నీ కాకుండా.. మధ్యమధ్యలో తన ఇతర ట్యాలెంట్స్ ని చూపించేందుకు ట్రై చేస్తుంటాడు. ముఖ్యంగా ఓ రేంజ్ ఇంటెన్సిటీ కావాల్సొనపుడు మాత్రం.. వర్మ ఎవరిని నమ్మడు. తన గొంతును అరువిచ్చి.. డబ్బింగ్ చెప్పి.. పాట పాడి రక్తి కట్టించేందుకు ట్రై చేస్తుంటాడు.

'కత్తులతో సావాసం.. నెత్తుటితో సమాప్తం' అంటూ రక్త చరిత్రలో పాట పాడిన వర్మ.. వంగవీటి కోసం మరోసారి తన గళం వినిపిస్తున్నాడు. 'చంపరా.. చంపెయ్యరా' అంటూ పాడే ఈ పాటలో.. మొదట ఈ రెండు లైన్లు మాత్రమే వినిపిస్తే.. ఇంతేనా పాట అనిపిస్తుంది కానీ.. సగం సాంగ్ అయ్యాక.. అసలు పాట మొదలవుతుంది. అప్పటివరకు ఆ రెండు పదాలను రకరకాలుగా పలికిన వర్మ.. అక్కడి నుంచి ప్రొఫెషనల్ సింగర్ కి ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో పాడేశాడు లెండి. వర్మ గొంతును కాకపోయినా.. నిజంగా వర్మ గొంతులో ఉన్న ఇంటెన్సిటీని మాత్రం పొగడాల్సిందే.

ఇంతకీ ఇప్పుడీ పాటను పోస్ట్ చేయాల్సిన అవసరమేంటంటే.. కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ పాడిన పాటతో పోల్చితే.. తన వాయిస్సే బెటర్ అనిపించిందట వర్మకు. రెండూ విని కంపేర్ చేయండి.. నేనే బెటర్ సింగర్ కాదా అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ.

Ram Gopal Varma Vangaveeti Songs on MaTelugu.Com - http://matelugu.com/site_vangaveeti-movie-rgv-last-film-trailer-download.xhtml




ThanQ Visit Again.

Related Posts