సినిమాకు ఫ్యామిలీతో వెళ్లిన సమయంలో ప్రారంభ సమయంలో మరియు ఇంటర్వెల్ పూర్తి అయిన తర్వాత వేసే దూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే యాడ్ ప్రేక్షకులకు ఇబ్బందిగా మారింది. ఆ యాడ్‌ను ఎంతగా వద్దనుకున్నా కూడా ప్రేక్షకులు దాన్ని సినిమా చూసిన ప్రతీ సారి చూడాల్సి వస్తూనే ఉంది. ప్రేక్షకుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఆరోగ్య శాఖ ఆ యాడ్‌ను తీసేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లో సినిమా థియేటర్లలో ఈ నగరానికి ఏమైంది అనే దూమపాన హెచ్చరిక కనిపించబోదు అని సినీ వర్గాల వారు అంటున్నారు.
సినిమా ఇండస్ట్రీలో సమూల మార్పుతో పాటు, పరిస్థితుల మెరుగుకు శ్యామ్ బెనల్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సీన్స్‌ను సినిమాలో ఉంచవద్దని వారు కేంద్రానికి సిఫార్సు చేశారు. ఇంకా పు సిఫార్సులను శ్యామ్‌బెనగల్ కమిటీ కేంద్రానికి సిఫార్సు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సిఫార్సులన్నింటికి కూడా కేంద్రం దాదాపుగా ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి. దూమపానం నిషేదంకు ఒక పోస్టర్‌ను వినియోగిస్తే చాలు అని ఈ కమిటీ సిఫార్సు చేస్తోంది. అందుకే త్వరలోనే మీరు ఈ నగరానికి ఏమైంది యాడ్‌ను చూడలేరు.
