ఎన్టీఆర్ గ్యారేజ్ కు భారత్ బంద్ అఫెక్ట్ ఉంటుందా ?




యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జనతా గ్యారేజ్ సినిమా ఆడియో ఈ నెల 12న సినిమా సెప్టెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే గ్యారేజ్ టీజర్ కు యూ ట్యూబ్ లో ఏకంగా 50 లక్షల వ్యూస్ వచ్చాయి. ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోతోంది. ముందుగా ఆగస్టు 12న గ్యారేజ్ రిలీజ్ డేట్ కన్ఫార్మ్ అయినా తర్వాత అనివార్య కారణాల వల్ల సెప్టెంబర్ 2కు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

 ఇదిలా ఉంటే గ్యారేజ్ కు ఇప్పుడు కొత్త కష్టం వచ్చిపడింది. ఈ సినిమా రిలీజ్ రోజున సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ మోడీ ప్రభుత్వం అనుసరిస్తోన్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా భారత్బంద్ కు పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను ఏకపక్షంగా సవరిస్తోందని నిరసిస్తూ వారు ఈ బంద్ చేపట్టనున్నారు. ఇక ఈ బంద్ కు జాతీయ స్థాయిలో 17 పార్టీల కూటమిగా ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ కూడా మద్దతు ఇచ్చింది. ఈ బంద్ ఎఫెక్ట్ జనతా గ్యారేజ్ పై పడనుంది.

  సెంట్రల్ ట్రేడ్ యూనియన్ వారు సెప్టెంబర్ 2న ఎవరైనా ప్రయాణాలు ఉంటే మార్చుకోవాలని కూడా సెంట్రల్ ట్రేడ్ యూనియన్ పిలుపునిచ్చింది. ఇక ఏపీ ప్రజలు కూడా ప్ర్యతేక హోదా విషయంలో మోడీపై చాలా సీరియస్ గా ఉన్నారు. వారు కసితీరా ఈ బంద్ కు పిలుపునిచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అదే జరిగితే ఏపీలో గ్యారేజ్ ఓపెనింగ్స్ పై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ట్రేడ్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 

 ఇక గ్యారేజ్ ను కేరళలలో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. అక్కడ లెఫ్ట్ పార్టీల ప్రాబల్యం ఎక్కువ. దీంతో అక్కడ కూడా ఓపెనింగ్స్ కు దెబ్బపడుతుందని చిత్రనిర్మాతలు కాస్త టెన్షన్ లో ఉన్నారు. సినిమాను భారీ రేట్లు పోసి కొన్న బయ్యర్లు సైతం ఇప్పుడు ఇదే టెన్షన్ లో ఉన్నారు. ఇక అదే రోజు కోలీవుడ్లో స్టార్ హీరోలు ధనుష్ తొడరి - విక్రమ్ ఇరుమురుగన్ (తెలుగులో ఇంకొక్కడు) రిలీజ్ అవుతున్నాయి. ఏదేమైనా ఎన్టీఆర్ సినిమాకు ఇప్పుడు భారతబంద్ టెన్షన్ పట్టుకుంది. 

అలాగని సినిమాను వాయిదా కూడా వేయలేరు. మరుసటి రోజు రిలీజ్ చేస్తే రెండు రోజుల షార్ట్ వీకెండ్ తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే ఒక రోజు ముందుగా సెప్టెంబరు 1నే ‘జనతా గ్యారేజ్’ను రిలీజ్ చేయాలని యోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఒకవేళ బంద్ విషయంలో మార్పులుంటే యధావిధిగా సెప్టెంబరు 2నే సినిమా విడుదలవుతుంది. అందుకే కొన్ని రోజులు వెయిట్ చేసి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ లోపు శుక్రవారం ‘జనతా గ్యారేజ్’ ఆడియో వేడుక ఘనంగా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఆ రోజు రిలీజ్ డేట్ ప్రస్తావన వచ్చినపుడు కొరటాల అయినా.. ఎన్టీఆర్ అయినా ఎలా స్పందిస్తారో చూడాలి.

ThanQ Visit Again.

Related Posts