నాన్న తిట్టాడని సమంతాతో చైతూ జంప్ !! తోడుగా రానా , రవితేజ , రెజినా , రకుల్




అక్కినేని నాగ చైతన్య, సమంత కొంత కాలంగా ప్రేమలో ఉండటం త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వారు స్వయంగా ప్రకటించకపోయినా అటు సమంత కొన్ని క్లూలు ఇవ్వడం ద్వారా, నాగార్జున కూడా పరోక్షంగా ఇది వాస్తవమే అని చెప్పకనే చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ నాగ చైతన్య, సమంత హైదరాబాద్ లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మీడియా కంట పడటం, అదో పెద్ద ఇష్యూ కావడం, అటు పత్రికలు, న్యూస్ ఛానల్స్, వెబ్ మీడియా వీరి ఎఫైర్ గురించి రకరకాలుగా రసేయడంతో నాగార్జునకు కోపం వచ్చింది. ఓసారి ఇద్దరినీ పిలిచి క్లాస్ పీకడంతో పాటు మీడియాతో ప్రతి సారి ఈ విషయం గురించి ఏదో ఒకటి వాగేస్తున్న సమంతను సైతం గట్టిగా మందలించాడు. దీంతో సమంత, నాగ చైతన్య ఈ మధ్య పూర్తిగా సైలెంట్ అయిపోయారు. హైదరాబాద్ లో ఇద్దరూ కలిసి బయట తిరగడం మానేసారు. అయితే ప్రేమలో మునిగితేలుతున్న ఒక జంట ఒకరినొకరు చూడకుండ ఉండటం ఎంత కష్టం. అందుకే వారి ఫ్రెండ్స్ అంతా కలిసి ఓ చక్కటి ప్లాన్ చేసారని, అంతా కలిసి ఏకాంతంగా గడపడానికి, మీడియా హడావుడి నుండి తప్పించుకోవడానికి విదేశాలకు జంప్ అయ్యారని ప్రచారం జరుగుతోంది. సమంత, నాగ చైతన్య విరహవేదన, వారు పడుతున్న బాధ చూస్తూ ఉండలేక వారి స్నేహితులైన రవితేజ, రానా, రకుల్, రెజీనా, ప్రీతిరెడ్డి, నీరజ కోన తదితరులు విదేశీ టూర్ ప్లాన్ చేసారు. అంతా కలిసి బెల్జియం వెళ్లారు. అక్కడ జరుగుతున్న మ్యూజిక్ ఫెస్టివల్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడైతే ఇక్కడిలాగా మీడియా గొడవ ఉండదు, ప్రైవసీ కూడా ఎక్కువగా ఉంటుంది, కావాల్సినంత ఏకాంతంగా గడపొచ్చు. వీరి బెల్జియం టూర్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. ఇందులో అంతా కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి కానీ... సమంత, నాగ చైతన్య పక్క పక్కన ఉన్న ఫోటోలు మాత్రం లేవు. అలాంటి ఫోటోలు ఉంటే మళ్లీ తమపై లేని పోని వార్తలు ప్రచారంలోకి వస్తాయనే ఉద్దేశ్యంతో ఫోటోల వరకు మాత్రం... కాస్త దూరంగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
ThanQ Visit Again.

Related Posts