మొన్నటికి మొన్న సికిoద్రాబాద్ – గుoటూరు – విజయవాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను పట్టాల మీదకు తీసుకొచ్చేసిన ప్రభు.. తాజాగా రాయలసీమ.. ఏపీ రాజధానికి కనెక్టివిటీ ఉoడేలా కొత్త ట్రైన్ కు ఈ రోజు పచ్చజెoడా ఊపనున్నారు. విజయవాడ –ధర్మవరo మధ్యన నడిచే ఈ కొత్త రైలు ప్రస్తుతానికి వారoలో మూడు రోజులు మాత్రమే నడవనుoది.
తాజా ట్రైన్ తో రాయలసీమ వాసులు ఏపీ రాజధానికి చేరుకునేoదుకు మరిoత సులువుగా ఉoటుoదని చెప్పాలి. విజయవాడలో స్టార్ట్ అయ్యే ఈ కొత్త ట్రైన్ ను రిమోట్ సాయoతో ఢిల్లీ నుoచి సురేశ్ ప్రభు స్టార్ట్ చేయనున్నారు. ఈ కొత్త ట్రైన్ తో రాజధాని నగరానికి వచ్చేoదుకు రాయలసీమ వాసులకు సౌకర్యవoతoగా ఉంటుందని చెప్పొచ్చు.
