భారతీయులు స్విస్‌ బ్యాంకుల్లో ఎంత దాచారో తెలుసా !




విదేశీ బ్యాంకుల్లో భారతీయులు దాచిన డబ్బుపై రోజుకో అంకె వెల్లడవుతుండగా తాజాగా స్విస్‌ బ్యాంకుల్లో భారతీయులు దాచిన మొత్తం గణనీయంగా తగ్గుతున్నదని ఓ నివేదిక వెల్లడించింది. స్విస్‌ బ్యాంకుల్లో అత్యధిక మొత్తాలు కలిగిన దేశాల జాబితాలో బ్రిటన్‌ ముందు వరుసలో నిలిచింది. ఈ జాబితాలో గత ఏడాది 61వ స్థానంలో ఉన్న భారత్‌ ప్రస్తుతం 75వ స్థానానికి పడిపోయింది. స్విట్జర్లాండ్‌ కేంద్ర బ్యాంకు (ఎస్‌ఎన్‌బీ) వెల్లడించిన తాజా వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

2007 వరకూ స్విస్‌ బ్యాంకుల్లో దాచిన మొత్తాల్లో టాప్‌ 50 జాబితాలో భారత్‌కు చోటు దక్కేది. 2004లో ఈ జాబితాలో భారత్‌ 37వ పొజిషన్‌లో ఉండ గా ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఆ సంఖ్య పడిపోతూ వచ్చినట్టు నివేదిక చెబుతున్నది. ఇక 2015లో ప్రపంచ వ్యాప్తంగా స్విస్‌ బ్యాంకుల్లో దాచిన మొత్తం 4 శాతం మేర పడిపోయి రూ 98 లక్షల కోట్లకు తగ్గిందని తాజా నివేదిక వెల్లడించింది. ఈ మొత్తంలో 25 శాతంతో బ్రిటన్‌ టాప్‌ పొజిషన్‌లో నిలవగా 14 శాతం మొత్తంతో అమెరికా తర్వా తి స్ధానంలో ఉంది. ఇక రూ 8392 కోట్లతో స్విస్‌ బ్యాం కుల మొత్తాల్లో భారత్‌ 75వ స్ధానంలో నిలిచింది. 1996 తర్వాత రెండు దశాబ్ధాల కనిష్టస్ధాయిలో భారతీయులు స్విస్‌ బ్యాంకుల్లో దాచిన మొత్తంగా ఇది రికార్డయింది. ఇక పాకిస్తాన్‌ 69వ స్థానంలో ఉంది. బ్రిక్స్‌ దేశాల తో పోల్చినా భారత్‌ ర్యాంక్‌ తక్కువగా ఉండటం గమనార్హం.
ThanQ Visit Again.

Related Posts